Sonia Gandhi: విమానంలో సోనియా గాంధీ.. రాహుల్‌ భావోద్వేగ పోస్టు

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీలు (Rahul Gandhi) ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇటీవల భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. ఈ ఘటనపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ భావోద్వేగ పోస్టు చేశారు.

Published : 20 Jul 2023 01:40 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్‌ గాంధీలు (Rahul Gandhi) ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇటీవల భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం కారణంగా పైలట్లు ప్రయార్టీ ల్యాండింగ్‌ చేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. భావోద్వేగ పోస్టు చేశారు. ఒత్తిడిలోనూ ఎంతో ధైర్యంగా ఉన్నారని పేర్కొంటూ ఓ ఫొటో షేర్ చేశారు. విమానంలో కూర్చున్న సోనియా గాంధీ.. ఆక్సిజన్‌ ధరించిన ఆ ఫొటోను రాహుల్‌ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

జులై 18న బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో పాల్గొన్న సోనియా, రాహుల్‌ గాంధీలు.. ఆ సాయంత్రం దిల్లీకి బయలుదేరారు. మార్గమధ్యంలో ఆ విమానం భోపాల్‌లో ల్యాండ్‌ అయ్యింది. పైలట్లు అత్యవసరంగా విమానాన్ని భోపాల్‌లో దించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది అత్యవసర ల్యాండింగ్‌ కాదని, ‘ప్రయార్టీ ల్యాండింగ్‌’ అని విమానాశ్రయ డైరెక్టర్‌ పేర్కొన్నారు. అనంతరం ఆ రాత్రి మరో విమానంలో సోనియా, రాహుల్‌ దిల్లీ బయలుదేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు