Chennai: శబరిమలకు వందే భారత్‌ ప్రత్యేక రైలు

శబరిమలకు వెళ్తే భక్తుల రద్దీ దృష్ట్యా సదరన్‌ రైల్వే వందే భారత్‌ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.

Published : 14 Dec 2023 01:56 IST

చెన్నై: శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సదరన్‌ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై-కొట్టాయం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయించింది. డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి కొట్టాయం వరకు వందే భారత్‌ రైలు (06151)ను వారంలో రెండు రోజుల పాటు నడపాలని నిర్ణయించింది. ఈ రైలు డిసెంబర్‌ 15, 17, 22, 24 తేదీల్లో చెన్నై నుంచి తెల్లవారు జామున 4.15గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.15గంటలకు కొట్టాయం చేరుకోనుంది. అలాగే, 06152 వందేభారత్‌ శబరి రైలు డిసెంబర్‌ 16, 18, 23, 25 తేదీల్లో  కేరళ టౌన్‌లో నుంచి ఉదయాన్నే 4.40గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5.15గంటలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు కాట్పడి, సేలం, పాలక్కడ్‌, అలువా స్టేషన్లలో ఆగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని