Smriti Irani: పెళ్లిపై నెటిజన్ ప్రశ్న.. దీటుగా బదులిచ్చిన స్మృతి ఇరానీ

తన వ్యక్తిగత జీవితం గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సూటిగా సమాధానం ఇచ్చారు. అలాగే తన ఇష్టాయిష్టాల గురించి వెల్లడించారు. 

Updated : 14 Aug 2023 16:37 IST

దిల్లీ: కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో నిర్వహించిన  Ask Me Anything సెషన్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దీటుగా బదులిచ్చారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ అడిగిన ప్రశ్నకు ఆ ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానం చెప్పారు. అలాగే పలు అంశాలపై స్పందించారు. 

మీరు మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా..? అని ఈ సెషన్‌లో భాగంగా ఓ నెటిజన్ కేంద్రమంత్రినే డైరెక్ట్‌గా అడిగేశాడు. దానికి ఆమె బదులిస్తూ.. ‘లేదు. మోనా నాకంటే 13 ఏళ్లు పెద్దది. కాబట్టి ఆమె నా బాల్య స్నేహితురాలు అయ్యే అవకాశం లేదు. రాజకీయ నాయకురాలు కాదు. అందుకే ఆమెను రాజకీయాల్లోకి లాగొద్దు. ఏదైనా ఉంటే నాతో పోరాడండి. ఆమెను గౌరవించండి’ అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

వారణాసిలో మోదీపై ప్రియాంక పోటీ చేస్తే...! సంజయ్‌ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక ఈ సెషన్‌లో ఆమె తనకు ఇష్టమైన ఆహారం, ప్రాంతాలు.. ఇలా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. 

నెటిజన్‌: వడాపావ్‌, పానీపూరీ రెండింటిలో ఏది ఇష్టం

ఇరానీ: రెండూ ఇష్టం

నెటిజన్‌: దిల్లీ లేక ముంబయి

ఇరానీ: రెండూ ఇష్టమైన నగరాలే

నెటిజన్‌: మీరు ఇంత నిజాయతీగా ఉండి రాజకీయాల్లో ఎలా విజయం సాధిస్తున్నారు..?

ఇరానీ: అదంతా అదృష్టం

నెటిజన్‌: నేనొక గ్రామం నుంచి వచ్చిన యువతిని. నేను మీలా ఎదగాలంటే..?

ఇరానీ: మీరు నాలా కావాలని కోరుకోవద్దు. నిజాయతీగా ఉండండి. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది

టీవీ రంగం నుంచి తన కెరీర్ మొదలు పెట్టిన స్మృతి(Smriti Irani).. ఇప్పుడు భాజపాలో కీలక నేతగా ఎదిగారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్మృతి ఇరానీ 2001లో జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అంతకు ముందు జుబిన్‌కు మోనాతో వివాహమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని