ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ వద్దే చోరీ.. తర్వాత సీన్‌ రివర్స్‌!

ఒంటరిగా ఉన్న వ్యక్తిని అదును చూసి ఇద్దరు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో వారి సీన్‌ రివర్స్‌ అయింది.

Published : 18 Mar 2024 13:11 IST

దిల్లీ: ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేద్దామమని యత్నించి.. ఇద్దరు చైన్ స్నాచర్లు (snatchers) అడ్డంగా బుక్కయ్యారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

వినోద్ బడోలా ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ (Encounter Specialist). ఆయన దిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్నారు. సాయంత్రపు నడకకు వెళ్లిన ఆయనపై హఠాత్తుగా ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఒకరు వినోద్ ముఖంపై దాడి చేయడంతో కిందపడిపోయారు. ఆ వెంటనే మరొకరు ఆయన మెడలో ఉన్న గొలుసును లాగేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతలోనే తేరుకున్న ఆయన ఒకర్ని బంధించి.. వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు తాను బంధించిన వ్యక్తిని అప్పగించారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోయిన వ్యక్తిని పట్టుకున్నారు. వీరిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. వారి చరిత్ర బయటపడింది. వారు పలు కేసుల్లో నిందితులు అని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. వినోద్‌కు వృత్తిపరంగా మంచి పేరు ఉంది. అనేక ఉగ్రకార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆయన ధైర్య సాహసాలకు రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని