7 Days 6 Nights: ‘7 డేస్‌ 6 నైట్స్‌’ కొత్త ట్రైలర్‌ చూశారా?

ఎం. ఎస్‌. రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్‌, మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా రూపొందించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. జూన్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 20 Jun 2022 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎం. ఎస్‌. రాజు (MS Raju) దర్శకత్వంలో సుమంత్ అశ్విన్‌ (Sumanth Ashwin), మెహర్‌ చాహల్, రోహన్‌, కృతికా శెట్టి ప్రధాన పాత్రలుగా రూపొందించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’ (7 Days 6 Nights). జూన్‌ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు ప్రచార చిత్రాలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. నాయకానాయికలు తమ నటనతో అన్ని వర్గాల వారిని మెప్పించేలా ఉన్నారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సమర్థ్‌ గొల్లపూడి సంగీతం అందించారు. ‘వర్షం’, ‘ఒక్కడు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తదితర సూపర్‌హిట్‌ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించిన ఎం. ఎస్‌. రాజు ‘వాన’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘డర్టీ హరి’కి (Dirty Hariki) మంచి పేరు రావడంతో ‘7 డేస్‌ 6 నైట్స్‌’పై ఆసక్తి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని