ఐదుగురు టాప్‌ దర్శకులు.. ఐదు కథలు

ఐదుగురు ప్రముఖు తమిళ దర్శకులు లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఐదు కథలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, సుహాసిని మణిరత్నం, సుధ కొంగర, రాజీవ్‌ మేనన్‌, కార్తి సుబ్బరాజ్‌ కలిసి ‘పుతం పుదు కాలై’ అనే సినిమాను తెరకెక్కించారు.....

Updated : 30 Aug 2022 16:00 IST

లాక్‌డౌన్‌లో చిత్రీకరణ.. ట్రైలర్‌ చూడండి

చెన్నై: ఐదుగురు ప్రముఖ తమిళ దర్శకులు లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఐదు కథలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, సుహాసిని మణిరత్నం, సుధ కొంగర, రాజీవ్‌ మేనన్‌, కార్తిక్‌ సుబ్బరాజ్‌ కలిసి ‘పుతం పుదు కాలై’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. లాక్‌డౌన్‌లో కుటుంబాలు, మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయనే నేపథ్యంలో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘మోదీ 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించారు..!’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘21 రోజులా...!!..’ అని కొందరు ఆశ్చర్యపోతే, మరి కొందరు ఆనంద పడుతూ కనిపించారు. ‘లాక్‌డౌన్‌ పూర్తయింది తాత.. బయట ప్రపంచాన్ని చూసే సమయం వచ్చింది..’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ముగిసింది.

ఈ చిత్రంలో జయరాం, ఊర్వశి, కల్యాణి ప్రియదర్శన్‌, రీతూ వర్మ, శ్రుతి హాసన్‌, సుహాసిని, అను హాసన్‌, ఆండ్రియా, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. అక్టోబరు 16న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని