Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
‘కేజీయఫ్’ నటుడు వశిష్ఠ సింహా, ‘పిల్ల జమీందార్’ నటి హరిప్రియ పెళ్లి చేసుకున్నారు. వేడుకకు సంబంధించిన ఫొటోను మరో నటుడు ధనంజయ పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ నటులు వశిష్ఠ సింహా, హరిప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. వేడుకకు హాజరైన నటుడు ధనంజయ నూతన దంపతుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పోస్ట్ వల్లే ఈ పెళ్లి వార్త అభిమానులకు తెలిసింది. వశిష్ఠ, హరిప్రియ ఇద్దరిలో ఎవరూ తమ పెళ్లి ఫొటోలను ఇంకా షేర్ చేయలేదు. వీరి వివాహం మైసూర్‌లో జరిగిందని సమాచారం.
‘తకిట తకిట’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హరిప్రియ ఆ తర్వాత నటించిన ‘పిల్ల జమీందార్’తో మంచి గుర్తింపు పొందారు. ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘జైసింహా’ చిత్రాల్లోనూ ఆమె కనిపించారు. ‘నారప్ప’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వశిష్ఠ.. ‘నయీం డైరీస్’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాల్లో నటించారు. ‘కేజీయఫ్’లోని కమల్ అనే పాత్ర ఆయనకు క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ నిర్వాకమే కారణం: బండి సంజయ్
-
Politics News
Rahul disqualification: రాహుల్‌పై అనర్హత.. భాజపా సెల్ఫ్ గోల్: శశిథరూర్
-
Politics News
Minister KTR: భాజపాకు ఆర్థికం కంటే రాజకీయమే ప్రాధాన్యమైంది: కేటీఆర్
-
Movies News
Ajay Devgn: నా వల్లే ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వచ్చింది: అజయ్ దేవ్‌గణ్
-
General News
Andhra News: మూడో విడత వైఎస్సార్ ఆసరా నిధులు రూ.6,419 కోట్లు విడుదల
-
Sports News
Suryakumar: సూర్యకుమార్‌కు అవకాశాలివ్వండి.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు: యువీ