Sada: జీవితానికి ఏకైక లక్ష్యం సంతోషమే..: సదా

జీవితంలో ఎప్పుడూ ఉండవలసిన ఏకైక లక్ష్యం సంతోషంగా ఉండడమే అంటున్నారు నటి సదా. ‘జయం’ సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’,‘అపరిచితుడు’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి చేరువయ్యారు.

Published : 03 Oct 2022 00:06 IST

హైదరాబాద్‌‌: జీవితంలో ఎప్పుడూ ఉండవలసిన ఏకైక లక్ష్యం సంతోషంగా ఉండడమే అంటున్నారు నటి సదా. ‘జయం’ సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’,‘అపరిచితుడు’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్‌, సోషల్‌మీడియా వేదికలుగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్ట్ పెట్టారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలంటూ పేర్కొ్న్నారు. 
‘‘జీవితంలో ఉండాల్సిన ఏకైక లక్ష్యం సంతోషంగా ఉండడమే. మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు, అభిరుచులు, వ్యక్తులను గుర్తించండి. ఆనందంగా ఉండడమన్నేది మనలోనే ఉంది. దానికోసం ఎక్కడెక్కడో వెతకద్దు. మనల్ని తరచుగా అసంతృప్తికి గురిచేసే వ్యక్తులు అడుగడుగునా ఉంటారు. జీవితంలో చిరాకు కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. వాటి గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా మనకు ఆనందాన్నిచ్చే ఇతర విషయాలపై దృష్టి పెట్టాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం స్వార్థం కాదు. స్వార్థానికి ఆత్మవిశ్వాసానికి చాలా తేడా ఉంటుంది. స్వార్థపూరితంగా ఉండకండి. ఆత్మగౌరవంతో ఉండండి. మనశ్శాంతిగా ఉండాలంటే మీ చుట్టూ ఉన్న స్వార్థపరులకు దూరంగా ఉండండి’’ అని పోస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని