Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్‌ ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అఖిల్‌ అక్కినేని హీరోగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్‌’. ఏప్రిల్‌లో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది.

Updated : 29 Oct 2023 10:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘ఏజెంట్‌’ (Agent) చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్‌కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీ (Agent OTT Release Date) తాజాగా ఖరారైంది. ఓటీటీ ‘సోనీలివ్‌’ (SonyLiv)లో ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. ఈ వివరాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ సదరు సంస్థ ట్రైలర్‌ను షేర్‌ చేసింది (Agent Streaming Date). సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీసు ముందుకు ఏప్రిల్‌లో వచ్చిన సంగతి తెలిసిందే. పరాజయాన్ని పొందిన ఈ సినిమాని తొలుత మే 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ‘సోనీలివ్‌’ వెనక్కి తగ్గింది. దాంతో జూన్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయని రూమర్స్‌ వచ్చాయి. అనవసర సన్నివేశాలను తీసేసి, నిడివి కారణంగా తొలగించిన మంచి సీన్స్‌ను జోడించి సరికొత్త వెర్షన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఆలస్యంగా విడుదల చేయాలని సదరు సంస్థ భావించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి (Agent On SonyLiv). మరి, ఓటీటీలో ఏ వెర్షన్‌ విడుదలవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రముఖ నటుడు మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

రివ్యూ: స‌ప్త సాగ‌రాలు దాటి - సైడ్ ఎ

కథేంటంటే: రిక్కీ అలియాస్‌ రామకృష్ణ (అఖిల్‌) ఓ మధ్య తరగతి కుర్రాడు. ‘స్పై’ అవ్వడమే లక్ష్యంగా జీవిస్తుంటాడు. ఇందుకోసమే ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్ష రాస్తాడు. కానీ, ప్రతిసారీ ఇంటర్వ్యూలో రిజెక్ట్‌ అవుతుంటాడు. దీంతో ఇలా ప్రయత్నిస్తే లాభం లేదనుకొని తన ఎథికల్‌ హ్యాకింగ్‌ నైపుణ్యాలతో ఏకంగా ‘రా’ చీఫ్‌ డెవిల్‌ అలియాస్‌ మహదేవ్‌ (మమ్ముట్టి) సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి.. అతడి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు. కానీ, రిక్కీ కోతి చేష్టలు చూసి ఆయన కూడా తనని రిజక్ట్‌ చేసి వెళ్లిపోతాడు. మరోవైపు భారత దేశాన్ని నాశనం చేసేందుకు గాడ్‌ అలియాస్‌ ధర్మ (డినో మోరియా) చైనాతో కలిసి మిషన్‌ ర్యాబిట్‌ పేరుతో ఓ భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. అయితే, వీళ్ల కుట్రను చేధించి, మిషన్‌ ర్యాబిట్‌ను అడ్డుకునేందుకు మహదేవ్‌ తన ఏజెంట్‌ సాయంతో ఓసారి ప్రయత్నించి విఫలమవుతాడు. దీంతో ఆయన రెండోసారి ఆ మిషన్‌ కోసం రిక్కీని రంగంలోకి దించుతాడు. మరి ‘రా’కి పనికి రాడని పక్కకు పెట్టేసిన రిక్కీని అంత పెద్ద మిషన్‌ కోసం మహదేవ్‌ ఎందుకు రంగంలోకి దింపాడు? ఆయన ఆదేశాల్ని పక్కకు పెట్టి రిక్కీ కొని తెచ్చుకున్న ప్రమాదాలేంటి? అసలు స్పై అవ్వాలన్న తన లక్ష్యం వెనకున్న బలమైన కారణం ఏంటి? అతను మిషన్‌ ర్యాబిట్‌ను ఎలా అడ్డుకున్నాడు? వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? ఈ కథలో కేంద్రమంత్రి జయకిషన్‌ (సంపత్‌ రాజ్‌) ఏంటి? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు