Ajith Kumar: గుబురు గడ్డంతో అజిత్‌ న్యూ లుక్... ఏ సినిమా కోసమో మరి!

తెల్ల జుత్తు, తెల్ల గడ్డం, నల్లకోటు, క్యూట్‌ కళ్లజోడుతో వారెవ్వా అనిపిస్తున్నారు ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌.

Published : 03 Mar 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెల్ల జుత్తు, తెల్ల గడ్డం, నల్లకోటు, క్యూట్‌ కళ్లజోడుతో వారెవ్వా అనిపిస్తున్నారు ప్రముఖ నటుడు అజిత్‌ కుమార్‌. తన కుమారుడు అద్విక్‌ అజిత్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా దిగిన ఈ ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అజిత్‌ ట్రెండీ లుక్‌కు ఫిదా అయిన ఆయన అభిమానులు, నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సంబంధిత ఫొటోల్ని పోస్ట్‌ చేస్తూ ‘సూపర్‌’, ‘లుక్‌ అదిరింది’ అంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఫొటోల్లో అజిత్‌తోపాటు ఆయన భార్య షాలిని, కూతురు, కొడుకు ఉన్నారు. తన తదుపరి చిత్రం కోసం అజిత్‌ ఇలా సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఆయన హీరోగా నటించిన ‘వలిమై’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని