Alia Bhatt: ఫ్యామిలీ అంతా.. అల్లు అర్జున్‌తో ఎప్పుడు నటిస్తావని అడుగుతున్నారు?

బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పాన్‌ఇండియా చిత్రం మార్చి25న థియేటర్లలో ప్రేక్షకుల ముందకు రానుంది.  అల్లూరి సీతారామ రాజుగా చరణ్‌ కనిపించగా..

Published : 09 Feb 2022 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ పాన్‌ఇండియా చిత్రం మార్చి25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించగా.. ఆయన సరసన సీతగా ఆలియా నటించింది.తెలుగులో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉందంటూ తన ఆలోచనలను పంచుకున్న భామ.. మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘‘ మా కుటుంబ సభ్యులంతా అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రాన్ని వీక్షించారు. అప్పటి నుంచి వాళ్లంతా బన్నికి అభిమానులైపోయారు. అంతే కాదు.. నువ్వెప్పుడు అల్లు అర్జున్‌తో నటిస్తావ్‌ అని ఫ్యామిలీ అంతా అడుగుతున్నారు. బన్నితో నటించడానికి నేనూ ఎదురుచూస్తున్నా. ఆయనతో నటించే అవకాశం వస్తే.. ఎగిరి గంతులు వేస్తా’’ అని తన భావాలను వ్యక్తపరిచింది. 

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ  దర్శకత్వంలో ఆలియా నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. తదుపరి చిత్రాలు రణ్‌బీర్‌తో ‘బ్రహ్మాస్త్ర’, రణ్‌వీర్‌తో ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ షూటింగ్‌ దశలో ఉన్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని