Samantha: నటనలో బన్నీనే స్ఫూర్తి.. అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించిన సమంత

నటనలో అల్లు అర్జున్‌ తనకు స్ఫూర్తి అని సమంత అన్నారు.

Updated : 05 Mar 2024 12:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తానేంటో నిరూపించుకున్నారు నటుడు అల్లు అర్జున్‌ (Allu arjun). బన్నీ నుంచి ఐకాన్‌ స్టార్‌గా ఎదిగారు. తాజాగా ఈ స్టార్‌ హీరోపై సమంత (Samantha) ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్న సమంతను కొందరు స్టూడెంట్స్‌ ‘నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం చెప్పారు. ‘యాక్టింగ్‌లో నాకు అల్లు అర్జునే స్ఫూర్తి. తనతో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్‌ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ షేర్‌ చేస్తున్నారు. గతంలోనూ ఓ సందర్భంలో సమంత మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తన సూపర్‌ హీరో అని చెప్పిన విషయం తెలిసిందే.

మిస్‌ ఇండియా చిందేస్తే.. పొట్లాం కట్టిన బిర్యానీలా పూజా.. నెరవేరిన రష్మిక కల..

వీళ్లిద్దరూ కలిసి ‘సన్ ఆఫ్‌ సత్యమూర్తి’లో నటించారు. త్రివిక్రమ్‌  దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’లో అల్లు అర్జున్‌, సమంత ‘ఊ అంటావా..’ పాటలో చిందేశారు. ఈ పాట సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు కొన్ని కోట్ల వ్యూస్‌తో రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule) రూపొందుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఇందులోనూ ఓ ఐటెం సాంగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులోనూ సమంతనే కనిపించనున్నారని టాక్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని