Chiranjeevi: చిరంజీవికి పద్మవిభూషణ్‌.. ఎనలేని సంతోషాన్నిచ్చింది: అంబికా కృష్ణ

చిరంజీవిని పద్మవిభూషణ్‌ అవార్డు వరించడంపై అంబికా కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 29 Jan 2024 22:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు చిరంజీవి (Chiranjeevi) పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికకావడం తనకు ఎనలేని సంతోషాన్నిచ్చిందని ప్రముఖ వ్యాపార వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ (ambhika krishna) అన్నారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎంతో తపనతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి పాత్రను, చిత్రాన్ని మనసుపెట్టి చేశారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవలోనూ ఆయన ఎందరికో ఆదర్శం’’ అని పేర్కొన్నారు.

‘అమ్మకు ప్రేమ’తో చిరంజీవి.. జాన్వీ కపూర్‌ అలా.. దిశా ఇలా!

సీనియర్‌ నటుడు సాయి కుమార్‌ (Sai Kumar)- ఆయన తనయుడు, హీరో ఆది, మరో హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), నటుడు బ్రహ్మాజీ (Brahmaji), దర్శకుడు పవన్‌ సాధినేని (Pavan Sadineni) తదితరులు వేర్వేరుగా చిరంజీవిని కలిసి విషెస్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని