Anek: ఓటీటీలో ‘అనేక్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘అనేక్‌’. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడు.

Published : 24 Jun 2022 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘అనేక్‌’. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడు. అనుభవ్‌ సిన్హా దర్శకుడు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. కాగా,  ఇప్పుడీ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జూన్‌ 26 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద ముఠాలను అణచివేయడమే  ఇతివృత్తంగా ‘అనేక్‌’ తెరకెక్కించారు.  ఆయుష్మాన్‌ ఖురానా సాహసాలు, యాక్షన్‌ ఎపిసోడ్లు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. నటుడు జేడీ చక్రవర్తి హిందీలో పదేళ్ల తర్వాత ఈ సినిమాలో నటించడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని