Anil Ravipudi: అందుకు నేనెంతో గర్వపడుతున్నా: అనిల్‌ రావిపూడి

‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రబృందం శనివారం విజయవాడలో సందడి చేసింది. సినిమా పట్ల ప్రేక్షకుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. 

Published : 28 Oct 2023 19:32 IST

హైదరాబాద్‌: ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సక్సెస్‌లో భాగంగా శుక్రవారం నుంచి చిత్రబృందం థియేటర్‌ విజిట్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్‌ రావిపూడి, నటి శ్రీలీలతోపాటు పలువురు టీమ్‌ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లను సందర్శించి సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ టీమ్‌ విజయవాడలో సందడి చేశారు. సినిమా పట్ల ప్రేక్షకుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనిల్‌ రావిపూడి, శ్రీలీల విలేకర్లతో సరదాగా కాసేపు ముచ్చటించారు.

‘‘ప్రేక్షకుల నుంచి మా చిత్రానికి వస్తోన్న స్పందన పట్ల డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది నా ఏడో చిత్రం. ఇప్పటివరకూ తీసిన సినిమాలన్నీ ఒకే జానర్‌లో ఉండగా.. దీనిని మాత్రం నా రెగ్యులర్‌ జానర్‌లో కాకుండా కాస్త విభిన్నంగా చేశా. భగవంత్‌ కేసరి, విజ్జి పాప పాత్రల్లో బాలకృష్ణ, శ్రీలీల జీవించారు. సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ‘బనావో భేటీకో షేర్‌’ లాంటి అందమైన సందేశాన్ని ఇందులో చూపించా. కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన మహిళలందరికీ ఈ సినిమా అంకితం. డబ్బులతోపాటు పేరునీ ఇది నాకు అందించింది. అందుకు ఆనందిస్తున్నా. వేధింపుల పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఇందులో చూపించిన ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’ సీన్‌ని అందరూ ఆదరిస్తున్నారు. పోలీస్‌ అధికారులు, స్కూల్స్‌కు సంబంధించిన వాట్సాప్‌ గ్రూపుల్లో ఇది షేర్‌ అవుతోంది. అందుకు నేను గర్వపడుతున్నా’’

Suresh Gopi: జర్నలిస్ట్‌తో సురేశ్‌ గోపీ అసభ్య ప్రవర్తన.. సారీ చెబుతూ పోస్ట్‌

‘‘బాలకృష్ణ కోసమే ఈ కథ అనుకున్నా. ఆయన ఓకే అన్నాక కథలో డెవలప్‌మెంట్స్ చేశా. ‘పెళ్లిసందD’ విడుదలయ్యాక శ్రీలీల యాక్టింగ్‌ చూసి.. విజ్జిపాప పాత్రకు ఆమెకు సరిగ్గా నప్పుతారనిపించింది. అలా, ఆమె ఇందులో భాగమయ్యారు. తదుపరి సినిమా గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. ప్రస్తుతానికి ఈసినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నా’’ అని ఆయన అన్నారు. కెరీర్‌ ఆరంభంలో ఇలాంటి సినిమాలో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీలీల తెలిపారు. ఇలాంటి చిత్రంలో తాను భాగం కావడం పట్ల తన అమ్మమ్మ తాతయ్య గర్వపడుతున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు