Atlee: షారుక్‌కు అట్లీ పాదాభివందనం.. వీడియో వైరల్‌

ఓ అవార్డు వేడుకలో దర్శకుడు అట్లీ.. షారుక్‌ కాళ్లకు నమస్కారం చేశారు.

Published : 12 Mar 2024 11:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అట్లీ-షారుక్‌ ఖాన్‌ కాంబోలో వచ్చిన  ‘జవాన్’(Jawan) భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా జీ సినీ అవార్డుల్లో కూడా సత్తా చాటింది. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అట్లీ అవార్డు అందుకున్నారు. దీన్ని ప్రకటించగానే పక్కనే ఉన్న షారుక్‌కు పాదాభివందనం చేసి స్టేజ్‌పైకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఈ టాలెంటెడ్‌ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఉత్తమ నటుడిగా షారుక్‌ (Shah Rukh Khan) కూడా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అట్లీకు థ్యాంక్స్‌ చెప్పారు. ‘ఇంత గొప్ప కథకు నన్ను ఎంపిక చేసుకున్నందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం సౌత్‌ ఇండియాలోని తన ఇంటిని వదిలి ముంబయిలో ఉన్నారు. ఆయన కుటుంబం కూడా సహకరించింది. దీని కోసం నాలుగేళ్లు అవిశ్రాంతంగా కృషి చేసిన అట్లీకు, ఆయన టీమ్‌కు ధన్యవాదాలు’ అని చెప్పారు.

స్టాక్‌మార్కెట్‌.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు

అట్లీ (Atlee) తెరకెక్కించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘జవాన్‌’. గతేడాది సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ.1000కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షారుక్‌-విజయ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను ప్రకటించారు. ఇది రూ.3000 కోట్లు కచ్చితంగా వసూళ్లు చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే కోలీవుడ్‌ హీరో అజిత్‌ కుమార్‌ (Ajith)కోసం కూడా స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక వీటితో పాటు అల్లు అర్జున్‌తో కూడా ఓ ప్రాజెక్ట్‌ లైన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని