Bhamakalapam review: రివ్యూ: భామాకలాపం
Bhamakalapam review: ప్రియమణి కీలక పాత్రలో నటించిన ‘భామా కలాపం’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: భామాకలాపం; నటీనటులు: ప్రియమణి, జాన్ విజయ్, శాంతి రావు, శరణ్య ప్రదీప్ తదితరులు; సినిమాటోగ్రఫీ: దీపక్; ఎడిటింగ్: విప్లవ్ నైషిధం; సంగీతం: జస్టిస్ ప్రభాకరన్, మార్క్ కె. రాబిన్; రచన: అభిమన్యు, జయ కృష్ణ, అశ్విన్; దర్శకత్వం: అభిమన్యు; విడుదల: ఆహా
ఒకప్పుడు సినిమా విడుదల అంటే కేవలం థియేటర్లోనే. ఇప్పుడా పరిస్థితి లేదు. నటీనటులు, బడ్జెట్ అన్నీ కుదిరితే ఓటీటీలోనూ విడుదల చేసేందుకు అవకాశం ఉంది. కొన్నిసార్లు థియేటర్లు దొరకని పరిస్థితుల్లో చిన్న చిత్రాలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నాయి. అలా తాజాగా ‘ఆహా’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భామా కలాపం’(Bhamakalapam). ప్రియమణి నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?(Bhamakalapam review)
కథేంటంటే: అనుపమ మోహన్(ప్రియమణి)(Priyamani) గృహిణి. యూట్యూబ్‌లో వంటల ఛానెల్ నిర్వహిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను చేయడంతో పాటు, పక్కింట్లో ఏం జరుగుతుందోనన్న విషయాలను సైతం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. మరోవైపు కోల్‌కతా మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన గుడ్డు ఒకటి మాయమవుతుంది. ఆ గుడ్డు వల్ల అనుపమ, ఆమె కుటుంబం ఎలా ఇబ్బందుల్లో పడింది? ఇతరుల విషయాలను తెలుసుకోవాలన్న అనుపమ ఉత్సుకత వల్ల వచ్చిన ముప్పు ఏంటి? చివరకు ఆ ఆపద నుంచి ఎలా బయటపడింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ఒక విలువైన వస్తువు పోవటం లేదా దొంగతనానికి గురవటం. అది చేతులు మారుతూ వెళ్లే క్రమంలో కథానాయకుడు/నాయికలు ఇబ్బందుల్లో పడటం.. దాని నుంచి బయట పడేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు ఇలా థ్రిల్లింగ్ అంశాలతో నడిచే కథ, కథానాలు ప్రేక్షకుడిని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. గతంలో ‘స్వామి రారా’ ఇప్పుడు ‘భామా కలాపం’(Bhamakalapam). ఒకవైపు నవ్వులు పంచుతూనే సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కథలో లీనం చేయడంలో ‘భామా కలాపం’ దర్శకుడు అభిమన్యు విజయం సాధించారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథ రూ.200కోట్ల విలువైన గుడ్డు చుట్టూ తిరుగుతుందని దర్శకుడు చెప్పేశాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన అనుపమ చేసే ప్రయత్నాలు, దాని వల్ల ఇతరులు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. క్రిమినల్స్ చేతిలో నుంచి పడిపోయిన గుడ్డు కోసం వాళ్లు వెతకడం, అది అటు తిరిగి, ఇటు తిరిగి అనుపమ పక్కింట్లో ఉండే ఫిరోజ్ వద్దకు రావటం ఇలా కథనమంతా ఉత్కంఠగా సాగుతుంది. ఫిరోజ్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో అక్కడకు వెళ్లిన అనుపమ అనుకోని పరిస్థితుల్ల్లో హత్య చేయాల్సి రావటం, ఆ శవాన్ని మాయం చేసేందుకు ఆమె చేసే ప్రయత్నాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పోలీసుల విచారణ మొదలైన తర్వాత కథనం కాస్త నెమ్మదించినా, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు సినిమాపై మరింత ఉత్కంఠ కలిగిస్తాయి. అయితే, చివరికి వచ్చే సరికి సినిమాను చకచకా ముగించేసినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలను ఇంకాస్త ఉత్కంఠగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే: ప్రియమణి(Priyamani) నటించిన తొలి వెబ్ ఫిల్మ్ ఇది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన మహిళగా అనుపమ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేసే క్రమంలో ప్రియమణి హావభావాలు బాగున్నాయి. నాయర్‌గా జాన్ విజయ్ డిక్షన్ బాగుంది. శరణ్య ప్రదీప్ నటన నవ్వులు పూయిస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. దీపక్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ ఎడిటింగ్ బాగున్నాయి. పాటలేమీ గుర్తుండిపోయేవి కావు. మార్క్ కె. రాబిన్ నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. రచయిత, దర్శకుడు అభిమన్యు గుడ్డు చుట్టూ ఓ ఆసక్తికర కథను అల్లుకుని కామెడీ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. అయితే, పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కుటుంబమంతా ఓ థ్రిల్లర్ సినిమా చూడాలంటే ‘భామా కలాపం’ చూడొచ్చు.
బలాలు
+ కథ, కథనం
+ ప్రియమణి
+ ట్విస్టులు
బలహీనతలు
- పతాక సన్నివేశాలు
చివరిగా: అనుపమ వంట బాగుంది. కానీ, ఇంకాస్త ఉడికించాల్సింది!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్