Bhola Shankar: GPSతో ‘భోళా శంకర్‌’.. ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి

‘భోళా శంకర్‌’ (Bhola Shankar) విడుదల సందర్భంగా చిత్రబృందం అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించనుంది. 600కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.

Updated : 10 Aug 2023 14:36 IST

హైదరాబాద్‌: మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar). ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ ప్రకటించిన నాటి నుంచే అభిమానులు, సినీ ప్రియులు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. ఇప్పుడు మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు.

నేడు (ఆగస్టు 10) హైదరాబాద్‌ వీధుల్లో 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జీపీఎస్‌ ట్రాకింగ్‌ మొత్తంగా చూస్తే మెగాస్టార్‌ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీని చేపట్టడం విశేషం. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరోకు ఇలా ఉత్సవాలు చేయలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఇది సినిమా ప్రచారంలో భాగం మాత్రమే కాదని.. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని ఆయన గొప్పతనాన్ని ఇలా చాటుతున్నామని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరంజీవితో నటించిన నటీనటులు, ఆయన చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వీడియోలు పంపాలని ‘భోళా శంకర్‌’ మేకర్స్‌ కోరారు. 

దర్శకుడికి పదేళ్ల గ్యాప్‌.. సాయి పల్లవి స్థానంలో కీర్తిసురేశ్‌: ‘భోళాశంకర్‌’ సంగతులివీ!

ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించిన నాటి నుంచే ‘భోళా మేనియా’ పేరుతో సోషల్‌ మీడియాలో రకరకాల పోస్ట్‌లు షేర్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మెగాస్టార్‌ అభిమానులు ఏకంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. సూర్యపేట - విజయవాడ  జాతీయ రహదారిపై ఉన్న రాజు గారి తోట వద్ద దీన్ని పెట్టారు. టాలీవుడ్ చరిత్రలో ఇంత పెద్ద కటౌట్‌ ఇప్పటి వరకు ఏ హీరోకు ఏర్పాటు చేయలేదు. ఇక ఈ సినిమాలో మరోసారి వింటేజ్‌ చిరూని చూడడం కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని