బోరాట్‌: ఆస్కార్‌కు‌ నామినేటై.. గిన్నిస్‌‌ రికార్డు కొట్టింది

సినీ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కోసం ఇటీవల పలు సినిమాలు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలైన బోరాట్‌ సీక్వెల్‌ ‘బోరాట్‌-2’ చిత్రం కూడా ఆస్కార్‌ బరిలో నిలబడింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయనటి(బాకలోవా)

Updated : 27 Mar 2021 21:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కోసం ఇటీవల పలు సినిమాలు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలైన బోరాట్‌ సీక్వెల్‌ ‘బోరాట్‌-2’ చిత్రం కూడా ఆస్కార్‌ బరిలో నిలిచింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సహాయనటి(బాకలోవా) విభాగాల్లో ఈ చిత్రం నామినేట్‌ అయింది. కాగా.. ఈ సినిమా మరో అరుదైన రికార్డును కూడా సృష్టించింది. ‘ఆస్కార్‌కు  నామినేటైన అతిపెద్ద సినిమా టైటిల్‌’ ఉన్న చిత్రంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. బోరాట్‌-2 సినిమా పూర్తి టైటిల్‌ ‘‘బోరాట్‌ సబ్‌సీక్వెంట్‌ మూవీఫిల్మ్‌: డెలివరీ ఆఫ్ ప్రొడీజియస్‌ బ్రైబ్‌ టు అమెరికన్‌ రెజిమ్‌ ఫర్‌ మేక్‌ బెనిఫిట్‌ వన్స్‌ గ్లోరియస్‌ నేషన్‌ ఆఫ్‌ కజకిస్థాన్‌(Borat Subsequent Moviefilm: Delivery of Prodigious Bribe to American Regime for Make Benefit Once Glorious Nation of Kazakhstan). ఈ సినిమా ఇంగ్లిష్‌ టైటిల్‌లో 110 అక్షరాలు ఉన్నాయి. అందుకే గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించుకుంది.

బోరాట్‌ తొలిచిత్రం ‘బోరాట్‌: కల్చరల్‌ లెర్నింగ్స్‌ ఆఫ్‌ ఆమెరికా ఫర్‌ మేక్‌ బెనిఫిట్స్‌ గ్లోరియస్‌ నేషన్‌ ఆఫ్‌ కజకిస్థాన్‌’ 2006లో విడుదలైంది. కజకిస్థాన్‌కు చెందిన బోరాట్ అనే జర్నలిస్టు అమెరికాపై ఒక డాక్యుమెంటరీ తీయడానికి ఆ దేశానికి వెళ్తాడు. అక్కడ తనకు ఎదురైన అనుభవాలే సినిమా కథాంశం. ఈ సినిమాపై పలు విమర్శలు, వివాదాలతోపాటు ప్రశంసలు కూడా లభించాయి. ఆ తర్వాత 2020లో ‘బోరాట్‌-2 తెరకెక్కింది. దేశానికి చెడ్డపేరు తెచ్చాడన్న నేరంపై జైలు శిక్ష అనుభవించిన బోరాట్.. 14ఏళ్లు తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు. అతడికి కజకిస్థాన్‌లోని ఓ నేత పని అప్పగిస్తాడు. ఆ పని మీద మళ్లీ అమెరికా వెళ్లిన బోరాట్ ఏం చేశాడన్నది మిగతా కథ. గతేడాది అక్టోబర్‌లో ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే,‌ ఆ సమయంలో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పలు విమర్శలను ఎదుర్కొంది. కొన్ని చోట్ల ఈ సినిమాని నిషేధించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సినిమాపై ఆస్కార్‌ నామినేషన్‌ నుంచి అనర్హత వేటు వేయాలని ఇటీవల కజక్‌ అమెరికన్‌ అసోసియేషన్‌ అకాడమీ అవార్డ్స్‌ నిర్వాహకులను కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని