Breathe: ఓటీటీలోకి నందమూరి చైతన్య కృష్ణ ‘బ్రీత్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

నందమూరి చైతన్యకృష్ణ హీరోగా నటించిన ‘బ్రీత్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Updated : 05 Mar 2024 09:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి చైతన్యకృష్ణ (Chaitanya Krishna) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బ్రీత్‌’ (Breathe). నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ మూవీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 8 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ సదరు సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించారు. చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ఇది. గతంలో 2003లో వచ్చిన ‘ధమ్‌’ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ‘బ్రీత్‌’తో హీరోగా పలకరించారు.

కథేంటంటే..

రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరతారు. ఈ క్రమంలో ఆయన్ని చంపడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తారు. వాళ్ల నుంచి ఒక సామాన్య యువకుడు కాపాడతాడు. ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? కాపాడిన యువకుడికి ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం ఏంటి? అనేది అసలు కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని