Butterfly: నటనతో అదరగొట్టేసిన అనుపమ

వరుస గ్లామర్ రోల్స్‌లో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్‌ బాబు దర్శకుడు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశల....

Published : 03 Mar 2022 12:07 IST

హైదరాబాద్‌: వరుస గ్లామర్ రోల్స్‌లో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్‌ బాబు దర్శకుడు. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి గురువారం టీజర్‌ విడుదలైంది. ‘‘మీ కళ్లను నమ్మకండి. మీ మైండ్‌ని నమ్మకండి. మరి ఏం నమ్మాలి?’’అంటూ సాగే ఈ టీజర్‌లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేసేలా ఉంది. ప్రతి సీన్‌లో అనుపమ నటన అదరగొట్టేసేలా సాగింది. టీజర్‌ బట్టి చూస్తుంటే ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వలే ఇది రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని