
Cannes 2022: అట్టహాసంగా కేన్స్ ఉత్సవాలు.. కమల్, తమన్నా, ఊర్వశి లుక్స్ చూశారా
కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తోపాటు భారత తారలు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘కేన్స్’ చలనచిత్రోత్సవం మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న ఈ ఉత్సవాల్లో వివిధ దేశాలకు చెందిన తారలు తళుక్కున మెరిశారు. ఈ ఉత్సవాల్లో భారత్‌కు ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడంతో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మాధవన్, రిక్కీ కేజ్, వాణీ త్రిపాఠి, ప్రసూన్ జోషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్.. తొలి రోజున ఎర్రతివాచీపై ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు నటి, ప్రముఖ మోడల్ ఊర్వశి రౌతెలా తెల్ల గౌనులో మెరిసిపోగా.. విశ్వనటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ కోట్‌లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఈ ఏడాది జ్యూరీ సభ్యురాలిగా దీపిక.. సభ్యసాచి చీరకట్టులో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఫ్యాషన్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
జ్యూరీ సభ్యురాలిగా కేన్స్ వేదికపై చీరకట్టులో మెరిసిన దీపిక
రెడ్ కార్పెట్‌పై మెరుపులు మెరిపించిన మోడల్ ఊర్వశి
విక్రమ్ ట్రైలర్ విడుదల కోసం కేన్స్‌లో ఏఆర్. రెహమాన్, కమల్ హాసన్
కేన్స్‌కు తమన్నా.. ఫ్రాన్స్‌కు ఐశ్వర్య
రెడ్ కార్పెట్ వాక్‌కు సిద్ధమైన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఏడాది తొలిసారిగా కేన్స్ వేడుకల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌కు చేరుకున్న తమన్నా తెలుపు, నలుపు ఉన్న పొడవాటి గౌనులో ఎర్ర తివాచీపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. కేన్స్‌కు బయలుదేరుతున్న ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఇక, నటి ఐశ్వర్యారాయ్ కేన్స్‌లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌కు పయనమయ్యారు. భర్త అభిషేక్, కుమార్తె ఆరాధ్యలతో కలిసి ఆమె ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. నిక్, ప్రియాంక చోప్రా, పూజాహెగ్డే, హీనాఖాన్ సైతం ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
కుమార్తె ఆరాధ్యతో కలిసి ఫ్రాన్స్‌కు ఐశ్వర్య
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Modi: ప్రజల్లోనే ఉందాం.. ఎన్నికేదైనా గెలుద్దాం