Indira Devi: ఇందిరాదేవి కన్నుమూత.. వెక్కివెక్కి ఏడ్చిన సితార..

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరాదేవి (Indira Devi)(70) మరణ వార్తతో అంతటా విషాదచాయలు అలుముకున్నాయి....

Updated : 29 Sep 2022 15:42 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరాదేవి (Indira Devi)(70) మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఆమెకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు వెంకటేశ్‌, జీవితా రాజశేఖర్‌, కొరటాల శివ, అశ్వనీదత్‌, త్రివిక్రమ్‌, మురళీ మోహన్‌, మోహన్‌బాబు, బండ్ల గణేశ్‌, రామకృష్ణ, తమన్‌ తదితరులు ఇందిరాదేవికి తుది నివాళి అర్పించారు. కృష్ణ, మహేశ్‌, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చారు. నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి మహేశ్‌ కుమార్తె సితార తట్టుకోలేకపోయారు. మహేశ్‌ ఒడిలో కూర్చొని  కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి ఓదార్చినప్పటికీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. 

ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే.. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమని అర్థం చేసుకోవాలని వారు కోరారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts