God Father: ‘గాడ్ ఫాదర్’లో పవన్ నటిస్తే బాగుండేది కానీ: చిరంజీవి
చిరంజీవితో ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father). ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) చిరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..
* సినిమా ఎంపికలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు?
చిరంజీవి: కథే నాకు ప్రాధాన్యం. దర్శకులు కథ చెబుతున్నప్పుడే నేను విజువల్స్‌ను ఊహించుకుంటా. అది నా మనసుకు నచ్చితే సినిమా చేసేందుకు ఓకే చెబుతా. పాటలు, ఫైట్లు సెకండరీ. అవి అలంకారంలాంటివి. కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే పరాజయం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది.
* ‘గాడ్ ఫాదర్’.. పొలిటికల్ డ్రామా కదా. మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు ?
చిరంజీవి: ఇప్పటి నాయకుల్లో ఎవరూలేరు. లాల్ బహుదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్‌పేయీ అంటే బాగా ఇష్టం. వీరి హయాంలో దేశం పురోగతి సాధించింది.
* సల్మాన్‌ఖాన్‌ను తొలిసారి ఎప్పుడు కలిశారు?
చిరంజీవి: ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయం (బ్యాంకాక్)లో కలిశా. ఆ యాడ్ తెలుగులో నేను చేస్తే.. హిందీలో సల్మాన్ చేశాడు. అప్పటి నుంచీ మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నాకు ఆయన సోదరుడిలాంటివాడు. తనకు రామ్‌చరణ్ అంటే ఎంతో ప్రేమ. తను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చరణ్‌ను కలుస్తాడు. సల్మాన్ ఇచ్చిన జాకెట్ ఇప్పటికీ చరణ్ దగ్గర భద్రంగా ఉంది. ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అతని పుట్టినరోజున చరణ్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు.
* ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారు..!
చిరంజీవి: అవును. సల్మాన్ చేసిన పాత్రలో కల్యాణ్ కనిపించినా బాగుంటుంది. ఒకవేళ నటించమని కోరితే కల్యాణ్ కాదనేవాడు కాదేమో. కానీ, సల్మాన్ చేస్తే న్యాయంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చేవాడు. ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటం వల్ల సల్మాన్‌ఖాన్‌ను తీసుకున్నాం.
* ఈ సినిమాలో నాకెందుకు అవకాశం ఇచ్చారు?
చిరంజీవి: లాక్‌డౌన్‌లో మీ పాడ్‌కాస్ట్‌లు బాగా విన్నా. మీ డిక్షన్ బాగా నచ్చింది. ఇలాంటి గళమే ‘గాడ్ ఫాదర్’ కథని వినిపించాలి అనుకున్నా. అందుకే యూట్యూబర్ అయిన గోవర్థన్ పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నా. దర్శకుడు మోహన్‌కు చెప్పగానే వెంటనే అంగీకరించారు. నా నమ్మకాన్ని మీరు నిలబెట్టారు
పూరీ: మీతో కలిసి నటించాలంటే నాకు చాలా భయమేసింది. అందుకే సత్యదేవ్‌ను సలహా అడిగా.
* నయనతారతో నటించటం ఎలా అనిపించింది?
చిరంజీవి: తనతో నాకు ఇది రెండో సినిమా. ‘సైరా’లో మేం జంటగా కనిపించాం. కానీ, ఇందులో అన్నాచెల్లెళ్లుగా నటించాం. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. డెడికేషన్ ఉన్న నటి నయనతార. తన పోర్షన్‌కు సంబంధించి చిత్రీకరణ పూర్తయినా మరో సీన్ యాడ్ చేయాలనుకుంటున్నామని రమ్మంటే నో చెప్పకుండా వచ్చి నటించింది.
* సత్యదేవ్ గురించి?
చిరంజీవి: సత్యదేవ్ మీ ప్రొడక్ట్. తన విషయంలో మీరెంత ఆనందిస్తున్నారో నాకు తెలుసు. తను నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ నాకు బాగా నచ్చింది. ఇదేకాదు ఆయన ఇతర సినిమాల్లోని నటన, వాయిస్ ఆకట్టుకుంది. ఎవరీ అబ్బాయి? అని ఆరా తీస్తుంటే మీరు తెరకెక్కించిన ‘జ్యోతిలక్మి’ గుర్తొచ్చింది. ఓ రోజు సత్యదేవ్‌ను ఇంటికి పిలిచా. లాక్‌డౌన్ ఉన్నా వచ్చాడు. నా సినిమా ప్రభావం వల్ల తన తలకు అయిన గాయం గురించి వివరించాడు. త్వరలోనే తను సూపర్‌స్టార్ అవుతాడు.
* తమన్‌ను ఆరో ప్రాణం అన్నారు. ఎందుకలా?
చిరంజీవి: సినిమాకు కథ, దర్శకుడు, నటులు, రచయితలు, ఛాయాగ్రాహకుడు.. పంచ ప్రాణాలు. ‘గాడ్ ఫాదర్’ నేపథ్య సంగీతంపై ఆధారపడిన సినిమా. దాన్ని అద్భుతంగా చేశాడు తమన్. అందుకే సంగీత దర్శకుడిని ఆరో ప్రాణం అని అన్నాను. మాతృకలో పెద్దగా పాటలు లేవు. అలాంటిది ఈ రీమేక్‌ను తమన్ మ్యూజికల్ ఫిల్మ్‌గా మార్చాడు.
* దర్శకుడిగా మోహన్‌రాజా ఎందుకు తీసుకున్నారు?
చిరంజీవి: ఈ సినిమా కోసం ముందుగా కొంతమంది దర్శకులను అనుకున్నాం. ‘పాటలు, హీరోయిన్ లేకపోతే రిస్క్’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలంటే ఈ కథే సరైందనే నమ్మకంతో ఉన్నా. ఈ విషయంలో చరణ్ ప్రోత్సహించాడు. నిర్మాత ప్రసాద్.. మోహన్‌రాజాను సూచించారు. చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా మాతృక ‘తని ఒరువన్’ డైరెక్టర్ తనేకావటం, నాకు ‘హిట్లర్’ నుంచి తనతో పరిచయం ఉండటం కలిసొచ్చాయి. తన టీమ్‌తో కలిసి అద్భుతంగా స్క్రిప్టును మలిచాడు.
* మీ నుంచి పూర్తిస్థాయి కామెడీ సినిమా ఆశించొచ్చా?
చిరంజీవి: తప్పకుండా. భవిష్యత్తులో నా నుంచి రాబోయే సినిమాల్లో కామెడీని మీరు మిస్ అవ్వరు. ప్రస్తుతం నటిస్తున్న ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు మీ ఊహకు మించి ఉంటాయి.
* అనుకున్న ఫలితంరాకపోతే ఏం చేస్తారు?
పూరీ: విజయం వస్తే పొగుడుతారు. పరాజయం పొందితే ఫూల్‌లా చూస్తారు. ఇది సహజం. ఫెయిల్ అయితే ఒత్తిడి ఉంటుంది. అలా అని దాని గురించే ఆలోచించను. ఏం పోగొట్టుకున్నా ఆ బాధల్లోంచి నెలలోనే రికవరీ అయిపోతా. ‘లైగర్’ సినిమా ఫెయిల్ అయినా దాంతో చేసిన ప్రయాణాన్ని ఎంజాయ్ చేశా.
చిరంజీవి: ఫెయిల్యూర్‌ని సవాలుగా తీసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో చెక్ చేసుకోవాలి. అప్పుడు తిరిగి విజయం అందుకోవచ్చు. నేనూ ఆ కసితోనే ‘గాడ్ ఫాదర్’ చేశా.
* ‘ఆటో జానీ’ని ఏం చేశారు?
పూరీ: అది పాత కథ. ఇప్పుడు అంతకంటే మంచి కథ రాస్తా మీకోసం. త్వరలోనే మిమ్మల్ని కలిసి వినిపిస్తా.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
-
Sports News
IPL Final: అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్ నిర్వహణపై రూల్స్ ఏం చెబుతున్నాయి?