Chiranjeevi: ‘విశ్వంభర’ వచ్చేది ఆరోజే.. అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

చిరంజీవి (chiranjeevi) హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ‘విశ్వంభర’ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Published : 02 Feb 2024 10:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ‘అతీత శక్తుల పోరాటం నుంచి లెజెండ్స్‌ అవతరిస్తారు’ అంటూ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

‘శ్రీమంతుడు’ స్టోరీ ఇష్యూ.. స్పందించిన టీమ్‌.. ఏమందంటే?

ఈ సినిమాలో మరింత ఫిట్‌గా కనిపించడం కోసం చిరంజీవి జిమ్‌లో కసరత్తులతో చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన పంచుకోగా వైరలైంది.  ‘మెగాస్టార్‌ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్‌ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం.  దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అని ఈ సినిమాపై దర్శకుడు అంచనాలు పెంచేశారు. ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. కీరవాణి స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని