RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త రికార్డు.. ఎంత వసూలు చేసిందంటే?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’.

Published : 01 Apr 2022 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే తొలిరోజు కలెక్షన్లతో ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టి, మూడు రోజుల్లో రూ.500 కోట్లు వసూళ్లు చేసి సంచలనంగా మారిన ఈ సినిమా మరో కొత్త రికార్డు నమోదు చేసిందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడు రోజుల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 710 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని, ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించిందని తెలిపారు.

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ కనిపించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి స్వరాలు అందించారు. అలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్రల్లో కనిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని