Costume Krishna: శ్రీదేవి కోసం అప్పటికప్పుడు డ్రెస్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ (Costumes Krishna) కన్నుమూశారు. ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలకు పనిచేసిన ఆయన గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తన సినిమాలకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కాస్ట్యూమ్స్ కృష్ణ (Costume Krishna) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలకు పనిచేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ తన అనుభవాలను గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
శ్రీదేవి కోసం అప్పటికప్పుడు డ్రెస్ డిజైన్ చేసి..
ప్రముఖ దర్శకుడు బీఎన్ రెడ్డి (B. N. Reddy) కాస్ట్యూమ్స్ కృష్ణకు డిజైనర్‌గా మొదటి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు. శ్రీదేవి (Sridevi) లాంటి హీరోయిన్లు ఆయన డిజైన్ చేసిన డ్రెస్‌లనే వేసుకోవడానికి ఇష్టపడేవారు. ఒకసారి శ్రీదేవి కోసం ఓ నిర్మాత ముంబయిలోని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌తో పువ్వులతో డిజైన్ చేయించిన డ్రెస్ తెప్పించారు. అది శ్రీదేవికి నచ్చకపోవడంతో .. ఆ నిర్మాత వెంటనే కాస్ట్యూమ్స్ కృష్ణను పిలిచి దాన్ని సరిచేయమని కోరాడు. ‘ఎవరో కుట్టిన డ్రెస్‌ను నేను సరిచేయను’ అని చెప్పిన కాస్ట్యూమ్స్ కృష్ణ అప్పటికప్పుడు శ్రీదేవి కోసం అలాంటి డ్రెస్‌నే కుట్టి ఇచ్చారట. ఈ విషయాన్ని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (Costume Krishna passed away).
కోడి రామకృష్ణతో విడదీయరాని అనుబంధం..
చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన కాస్ట్యూమ్స్ కృష్ణలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) ఓ నటుడిని చూశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారత్ బంద్’ సినిమాలో విలన్‌గా అవకాశం ఇచ్చారు. అందుకే కాస్ట్యూమ్స్ కృష్ణ తన గురువుగా కోడి రామకృష్ణనే పేర్కొనేవారు. వీరిద్దరి ది విడదీయరాని అనుబంధం. ఆయన కూడా ఎక్కువగా కోడి రామకృష్ణ సినిమాల్లోనే నటించేవారు. ఇక ‘భారత్ బంద్’ సినిమాను థియేటర్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులు విలన్ పాత్రలో నటించిన కాస్ట్యూమ్స్ కృష్ణను తిట్టడం చూసి ఆయన భార్య పిల్లలు సినిమా చూడకుండా బయటకు వచ్చేశారు. అంతలా ఆయన తన పాత్రల్లో లీనమై నటించేవారు.
మహేశ్ బాబుతో అనుకొని మరొకరితో తీసి..
కాస్ట్యూమ్స్ కృష్ణకు ప్రముఖ నటుడు కృష్ణ గారంటే చాలా ఇష్టం. వారిద్దరూ మంచి స్నేహితులు. మహేశ్ బాబు (Mahesh Babu)తో సినిమా తీయాలని కాస్ట్యూమ్స్ కృష్ణ ఆయనకు కథ కూడా వినిపించారట. అంతా ఓకే అనుకునే సమయానికి మరో హీరోతో తీయాలని కాస్ట్యూమ్స్ కృష్ణ కుమారుడు ఆయనను బలవంతం పెట్టారట. దీంతో వేరే హీరోతో సినిమా తీసి కోటి రూపాయలు నష్టపోయారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తుచేసుకుని ఆయన బాధపడ్డారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana: రాష్ట్రంలో 53 మంది పోలీసు అధికారులకు పదోన్నతి
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
General News
Vskp-Sec Vande Bharat: ఈ నెల 10న నాలుగు గంటలు ఆలస్యంగా వందేభారత్
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
India News
Haridwar: ఆ ఆలయాలకు పొట్టి దుస్తులతో వస్తే కఠిన చర్యలు: మహానిర్వాణి అఖారా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు