Dadasaheb Phalke: అట్టహాసంగా ‘దాదా ఫాల్కే’ అవార్డుల వేడుక.. మూవీ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘పుష్ప’

సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎప్‌)-2022 పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది.  

Published : 21 Feb 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (డీపీఐఎఫ్‌ఎప్‌)- 2022’ పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. 2021లో విడుదలై, విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. పలువురు తారలు స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసి, ఆకట్టుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’.. ‘మూవీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు గెలుచుకుంది.

విజేతలు వీరే..

* ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌సింగ్‌ (83)

* ఉత్తమ నటి: కృతిసనన్‌ (మిమీ)

* ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): సిద్ధార్థ్‌ మల్హొత్రా (షేర్షా)

* ఉత్తమ నటి (క్రిటిక్స్‌): కియారా అడ్వాణీ (షేర్షా)

* ఉత్తమ సహాయ నటుడు: సతీష్ కౌశిక్‌ (కాగజ్‌)

* ఉత్తమ సహాయ నటి: లారా దత్తా (బెల్‌ బాటమ్‌)

* ఉత్తమ ప్రతినాయకుడు: అయూష్‌ శర్మ (అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌)

* ఉత్తమ పరిచయం: అహాన్‌ శెట్టి (థడప్‌)

* ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌ ): సర్దార్‌ ఉద్దమ్‌

* ఉత్తమ చిత్రం : షేర్షా

ఉత్తమ నటుడు (వెబ్‌ సిరీస్‌): మనోజ్‌ బాజ్‌పాయ్‌ (ది ఫ్యామిలీమ్యాన్‌)

* ఉత్తమ గాయకుడు : విశాల్ మిశ్రా

ఉత్తమ గాయని : కనికా కపూర్

* ఉత్తమ దర్శకుడు: కెన్ ఘోష్ (స్టేట్ ఆఫ్ సీజ్)

ఉత్తమ ఛాయా గ్రాహకుడు: జయకృష్ణ ( హసీనా దిల్ రుబా)

ఉత్తమ నటి (వెబ్ సిరీస్): రవీనా టాండన్ 

ఉత్తమ వెబ్ సిరీస్: క్యాండీ

ఉత్తమ లఘు చిత్రం: పౌలి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని