Dhanush: శేఖర్‌ కమ్ములతో ప్రాజెక్ట్‌ ఫిక్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు...

Published : 18 Jun 2021 09:42 IST

అధికారిక ప్రకటన వచ్చేసింది

హైదరాబాద్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. క్లాసిక్‌ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు శేఖర్‌కమ్ముల. అలాగే, బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌లో రానున్న ‘ది గ్రే మ్యాన్‌’ షూట్స్‌తో ధనుష్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని