Dhanush: ధనుష్‌- నాగార్జున మూవీ టైటిల్‌ ఇదే.. ఆసక్తి రేకెత్తించేలా పోస్టర్‌

ధనుష్‌ 51వ సినిమా టైటిల్‌ ఖరారైంది. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం పోస్టర్‌ విడుదల చేసింది.

Published : 08 Mar 2024 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ హీరో ధనుష్‌ (Dhanush) హీరోగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ప్రముఖ నటుడు నాగార్జున (Akkineni Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక (Rashmika) కథానాయిక. శివరాత్రిని పురస్కరించుకుని చిత్ర బృందం టైటిల్‌ని శుక్రవారం ప్రకటించింది. ఈ సినిమాకి ‘కుబేర’ (Kubera) అని పేరు పెట్టినట్లు తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది. ధనుష్‌ అందులో మాసిన దుస్తులు, గుబురుగడ్డంతో గుడి ముందు కనిపించి, సినిమాపై ఆసక్తి పెంచేలా ఉన్నారు.

ధనుష్‌ నటిస్తున్న 51వ (D 51) చిత్రమిది. సమాజంలోని అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ధనుష్‌ మరోవైపు స్వీయ దర్శకత్వంలో ‘రాయన్‌’లో నటిస్తున్నారు. అది ఆయనకు 50వ సినిమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు