NBK 109: సినిమా వేరే లెవల్‌.. ఇదే నా ప్రామిస్‌: బాబీ

బాలకృష్ణ (Balakrishna)తో తాను చేస్తోన్న చిత్రంపై స్పందించారు దర్శకుడు బాబీ (Bobby). ఇది మరో స్థాయిలో ఉండనుందని తెలిపారు.

Published : 25 Dec 2023 14:01 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. NBK 109గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా ఎలా ఉండనుంది? అంటూ అభిమానులు అడుగుతున్నారు. వాళ్లకు ఒక్కటే మాట ఇస్తున్నా. వేరే లెవల్‌లో ఉంటుంది. ఇటీవల ఊటీలో ఒక భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లనున్నాం. మా చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ వచ్చే ఏడాదిలో ఇస్తాం’’ అని ఆయన చెప్పారు.

Salaar: ‘సలార్‌’ను ఇలా తీర్చిదిద్దారు.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌..!

‘భగవంత్‌ కేసరి’ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ నవంబర్‌ నుంచి మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం గతంలో ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌.. వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌’ అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ సినీ ప్రియులను ఆకర్షించింది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌  కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని