Divi: అతడి మరణం.. ఎలాగైనా నటి కావాలని నిర్ణయించుకున్నా: దివి

అందం, అభినయంతో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు తెలుగమ్మాయి దివి (Divi). ఆమె హీరోయిన్‌గా నటించిన ‘లంబసింగి’ శుక్రవారం విడుదలైంది.

Published : 16 Mar 2024 00:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హీరోయిన్‌ లేదా సహాయనటి.. ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి దివి. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘లంబసింగి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పారు. తనకెంతో ఆప్తుడైన ఒక వ్యక్తి మరణం తనలో స్ఫూర్తి నింపిందన్నారు.

‘‘గతంలో నేనొక అబ్బాయిని ప్రేమించా. నన్నెంతో గౌరవించేవాడు. మా ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలుసు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతడు నాతో ఒక ఫ్రెండ్‌లా ఉండేవాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు చనిపోయాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నా. చనిపోయేలోపు ఏదైనా సాధించాలనుకున్నా. నాకెంతో ఇష్టమైన సినీ రంగంలోకి అడుగుపెట్టి నటిగా నిరూపించుకోవాలనుకున్నా. ప్రేమించిన అబ్బాయితో రిలేషన్‌షిప్‌ వర్కౌట్‌ కాలేదు. అతడికి పెళ్లైంది. సంతోషంగా ఉన్నాడు. ఆ బ్రేకప్‌ తర్వాత తిరిగి రిలేషన్‌లోకి వెళ్లాలనే ఉద్దేశం రాలేదు. నాకు కావాల్సిన లక్షణాలు ఉన్న అబ్బాయి దొరకలేదు’’ అని ఆమె చెప్పారు. రవితేజ హీరోగా నటించిన ఓ చిత్రంలో తనకి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారని.. ఏమైందో, ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రే తనని సినిమా నుంచి తొలగించారని ఆమె వెల్లడించారు. అప్పుడు ఎంతో బాధపడ్డానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని