DJ Tillu: ఓటీటీలో‘డీజే టిల్లు’.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే!

ఇటీవల థియేటర్లలో విడుదలై, యువతను అమితంగా ఆకట్టుకున్న చిత్రం ‘డీజే టిల్లు’.

Updated : 07 Dec 2022 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్లలో ఇటీవల విడుదలై, యువతను అమితంగా ఆకట్టుకున్న చిత్రం ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో మార్చి 4వ తేదీ నుంచి సందడి చేయనుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ సంస్థ ఓ ఫొటోని షేర్‌ చేసింది.  విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు.

టిల్లు కథ ఇదీ..

కుటుంబ సభ్యులు బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అని పేరు పెడితే దాన్ని టిల్లుగా మార్చుకుని డీజే నిర్వహిస్తున్న ఓ యువ‌కుడే.. క‌థానాయ‌కుడు (సిద్ధూ జొన్నల‌గ‌డ్డ‌). అంద‌రూ డీజే టిల్లు అని పిలుస్తుంటారు. మంచి మాట‌కారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ అయిన రాధిక (నేహాశెట్టి)ని తొలిసారి చూడ‌గానే ఇష్టప‌డ‌తాడు. ఆమెకి త‌న‌దైన శైలిలో మాట‌లు చెబుతూ చెలిమి చేస్తాడు. ఇంత‌లో అనుకోకుండా రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. అందులో టిల్లు కూడా ఇరుక్కుపోయే ప‌రిస్థితి ఏర్పడుతుంది. దాంతో రాధిక చెప్పింద‌ల్లా టిల్లు చేయాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ హ‌త్య కేసు నుంచి ఈ ఇద్దరూ బ‌య‌ట‌ప‌డ్డారా? లేదా? ఇంత‌కీ హ‌త్యకి గురైన వ్యక్తి ఎవ‌రు? అదెలా జ‌రిగింది? అన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని