DSP : క్లబ్‌లో దేవిశ్రీ డ్యాన్సులు.. వీడియో షేర్‌ చేసిన బాబీ..

‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు చిత్ర దర్శకుడు బాబీ (Bobby), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri Prasad). తాజాగా వీరిద్దరూ హైదరాబాద్‌లోని ఓ క్లబ్‌లో సందడి చేశారు.

Updated : 21 Jan 2023 12:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri Prasad)కు తెలియకుండా.. ఓ క్లబ్‌లో ఆయన డ్యాన్స్‌లు చేస్తోన్న వీడియోను దర్శకుడు బాబీ (Bobby) చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై దేవిశ్రీ స్పందిస్తూ.. ‘‘మీ డైరెక్టర్‌ యాంగిల్‌ చూపించారుగా’’ అని వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగిందంటే..?

బాబీ, దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వీరిద్దరూ కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ క్లబ్‌లో సందడి చేశారు. దేవిశ్రీ ‘వాల్తేరు వీరయ్య’లోని ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ’ పాటను ఆలపించి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఆయన గానంతో అక్కడే ఉన్న యువత సైతం స్టెప్పులు వేస్తూ పార్టీని ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియోను బాబీ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘మన దేవీతో కలిసి గత రాత్రి ఓ పార్టీకి వెళ్లాను. ప్రేక్షకుల్ని ఎలా ఉర్రూతలూగించాలో తనకు బాగా తెలుసు. ఆయన మ్యాజిక్‌ను మరోసారి ప్రత్యక్షంగా చూశా’’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఈ ట్వీట్‌పై తాజాగా దేవిశ్రీ స్పందించారు. ‘‘ఓ మై గాడ్‌! బాబీ ఈ వీడియో మీరెప్పుడు తీశారు? కనీసం నేను తెలుసుకోలేకపోయాను. మీ డైరెక్టర్‌ యాంగిల్‌ చూపించారుగా! క్లబ్‌ మూసివేసే సమయంలో అక్కడ ఉన్న వారందరూ ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ’ అని కేకలు వేస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది’’ అని బదులిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని