Dulquer: ఆయనతో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా: దుల్కర్ సల్మాన్

ప్రముఖ నటుడు మమ్ముట్టి కుమారుడిగా సినీరంగ ప్రవేశం చేసినా.. తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థాన్నాన్ని ఏర్పరచుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. టాలీవుడ్‌కు ‘మహానటి’ సినిమాతో జెమినీ గణేశన్‌గా పరిచయమై

Updated : 23 Sep 2022 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌కు ‘మహానటి’ సినిమాతో జెమినీ గణేశన్‌గా పరిచయమై.. ‘సీతారామం’తో రామ్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు దుల్కర్‌ సల్మాన్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి మమ్ముట్టికి తాను పెద్ద అభిమానినని చెప్పారు. ఆయనతో కలిసి నటించే  అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

‘‘1980లలో కొందరు మా నాన్నను విమర్శించడానికి ప్రయత్నించేవారు. కానీ, ఆయన అలాంటివేవీ పట్టించుకోకుండా తన ప్రయాణాన్ని సాగించారు. ఆయన ఈ రంగంలో ఎంతో సాధించారు. ఆయన్ని విమర్శించాలనుకున్నవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. విమర్శకులు ఎప్పుడూ ఒకేలా ఉండరని మా నాన్న నాకు చెప్పారు. అలాగే మనల్ని ఇష్టపడే వారు ఒకేలా ఉండరు. 2012, 2013లో నన్ను ఇష్టపడిన వారు.. ఇప్పటికీ నన్ను కచ్చితంగా ఇష్టపడుతూ ఉంటారని నేను చెప్పలేను’’ అంటూ తన తండ్రిని చూసే విమర్శకులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని