Eagle: మరొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు.. దుష్ర్పచారంపై ‘ఈగల్‌’ నిర్మాత ఫైర్‌

తన కామెంట్స్‌పై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఈగల్‌ నిర్మాత మండిపడ్డారు.

Published : 09 Feb 2024 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (Ravi Teja) హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Gattamneni) తెరకెక్కించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle). నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. దీని ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఇటీవల మాట్లాడుతూ.. తన నిర్మాణ సంస్థలో అవినీతి జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. తన మాటలపై కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

‘‘ప్రొడక్షన్ హౌస్‌లో జరిగిన అవినీతి వల్ల సినిమాల్లో క్వాలిటీ ఎలా దెబ్బతింటుందో చెప్పాను. దానిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నానో వివరించాను. కానీ, కొందరు వ్యక్తులు నేను కార్మిక సంఘాల సభ్యులను,  శ్రామికులను కించపరిచినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. ఇష్టపడి సినిమా రంగంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కంపెనీలో నిజాయతీగా ఉండే వారు గర్వంగా పనిచేసుకోవచ్చు. అవినీతి పరులపై లీగల్ యాక్షన్‌ తీసుకోవాలనుకున్నా.. వాళ్ల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వదిలేశాను. నేను ఇప్పటి వరకు ముప్పైకి పైగా సినిమాలు తీశాను. మరో పాతిక సినిమాలు మా ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తున్నాయి. నేను యూనియన్‌ వర్కర్స్‌కు వ్యతిరేకం కాదు’ అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని