రెండేళ్లుగా సేమ్‌ ఫుడ్‌.. నా భార్య నన్ను వదిలేస్తానని బెదిరించింది: బాలీవుడ్‌ నటుడు

బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 06 Mar 2024 19:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘షో టైమ్‌’ (Show time)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi). దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొంతకాలంగా ఒకేవిధమైన ఆహారం తీసుకుంటున్నానని చెప్పారు.

‘‘ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధగా వ్యవహరిస్తుంటా. డైట్‌ కచ్చితంగా ఫాలో అవుతుంటా. గతంలో క్వినోవా ఎక్కువగా తినేవాడిని. ఇప్పుడు దానిని తీసుకోవడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఒకే విధమైన డైట్‌ ఫాలో అవుతున్నా. అవకాడో, అరుగుల ఆకులు, లెట్యూస్‌ సలాడ్‌, చిలకడదుంపలు, చికెన్ కీమాతో భోజనం. ఇది కాకుండా వేరేది తినను. ఫుడ్‌ విషయంలో నా భార్య ఎంతో విసిగిపోయింది. వదిలేస్తానంటూ బెదిరించింది. కాకపోతే ఇప్పటివరకూ ఆ పని మాత్రం చేయలేదు’’ అని ఇమ్రాన్‌ నవ్వులు పూయించారు.

Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ఎలా ఉందంటే?

ఐశ్వర్యరాయ్‌ను ప్లాస్టిక్‌ అంటూ గతంలో తాను చేసిన కామెంట్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘దాదాపు పదేళ్ల క్రితం ‘కాఫీ విత్‌ కరణ్‌’లో పాల్గొన్నా. ఆ కార్యక్రమంలో ఐశ్వర్యను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఎంతోమంది నన్ను విమర్శించారు. ఆమెను కామెంట్‌ చేసే ఉద్దేశం నాకు లేదు. ఆరోజు నేను జోక్‌గానే అన్నా. ఆ వ్యాఖ్యల విషయంలో నేను ఏమాత్రం బాధపడటం లేదు’’ అని ఆయన చెప్పారు.

‘షో టైమ్‌’ విషయానికి వస్తే.. సినిమా పరిశ్రమలో బంధుప్రీతి, ఎలాంటి సపోర్ట్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయి? అడుగడుగునా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది. మిహిర్‌ దేశాయ్‌, అర్చిత్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. డిస్నీ + హాట్‌స్టార్‌ స్పెషల్‌గా మార్చి 8 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇమ్రాన్‌ హష్మీ, మహిమా మక్వానా, మౌనీరాయ్‌, శ్రియ, నసీరుద్దీన్‌ షా కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని