Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
ఫహద్ ఫాజిల్ నటించిన ‘మాలిక్’ ఎలా ఉందంటే..?
Fahadh Faasil MALIK Review చిత్రం: మాలిక్; తారాగణం: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్ట్, జోజీ జార్జ్, దిలీష్ పోథన్, తదితరులు; సంగీతం: సుషిన్ శ్యామ్; సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్; ఎడిటింగ్: మహేశ్ నారాయణన్; నిర్మాత: అనిల్ కె.రెడ్డి, కిషోర్ రెడ్డి; నిర్మాణ సంస్థ: యాంట్స్ టు ఎలిఫెంట్స్ సినిమాస్; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్ నారాయణన్; విడుదల: ఆహా; తేదీ: 12-08-2021
నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని ఈ మధ్యకాలంలో వెండితెరపై ఎన్నో కథలు వచ్చాయి. అందులోనూ సాంఘిక, సామాజిక కోణాల్లో తెరకెక్కిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం కూడా పట్టారు. ఇప్పుడు అదే కోవలో భూ కబ్జా, రాజకీయ అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ ‘మాలిక్’. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. కాగా, తాజాగా ‘ఆహా’ వేదికగా శుక్రవారం నుంచి ‘మాలిక్’ తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మాలిక్’గా ఫహద్ మెప్పించాడా? తెలుగు వారికి ఈ కథ ఎంతవరకు చేరువైందనేది తెలుసుకుందాం పదండి..!
కథేంటంటే: అలీ అహ్మద్ సులేమాన్ మాలిక్ (ఫహద్ ఫాజిల్) కేరళలోని రందాన్‌పల్లి అనే సముద్రతీర ప్రాంతానికి గ్యాంగ్‌స్టర్. ఆ ప్రాంతంలో ఆయన మాటే శాసనం. ఆఖరికి పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఆయన మాట వినాల్సిందే. అదే సమయంలో కేరళ తుపాను బాధితులకు ఇళ్లు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంటుంది. స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు.. తుపాను బాధితుల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులతో కలిసి కమర్షియల్ ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్.. రాజకీయ నాయకులను హెచ్చరిస్తాడు. తమ పనికి సులేమాన్ అడ్డు వస్తున్నాడని భావించిన వాళ్లు.. ఏళ్ల క్రితం జరిగిన ఓ మత ఘర్షణ కేసును రీ ఓపెన్ చేసి.. హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న సులేమాన్ని జైలుకి పంపిస్తారు. జైల్లోనే అతడిని చంపేయాలని ప్లాన్ చేస్తారు. ఇంతకీ వారి ప్లాన్ ఏమైంది? రందాన్‌పల్లికి ఆయన ఎలా మాలిక్ అయ్యాడు? మాలిక్‌గా మారే క్రమంలో అతడు తన జీవితంలో ఏం కోల్పోయాడన్నది మిగిలిన కథ.
ఎలా ఉందంటే: ఒక సాధారణ వ్యక్తి ప్రజల కోసం, వ్యవస్థ కోసం ఒంటరిగా పోరాటం చేసి పరిస్థితుల ప్రభావంతో ఓ శక్తిగా ఎదుగుతాడు. అతడి చుట్టుపక్కల ఉన్న మనుషుల అండతో ఒక ‘డాన్’లా, ‘గాడ్‌ఫాదర్’లా మారి వాళ్లను కాపాడుతుంటాడు. అలాంటి గాడ్ఫాదర్ల అడ్డు తప్పించి ఆ ప్రాంతంపై పట్టు సాధించడానికి కొన్ని దుష్టశక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. మంచికి, చెడుకు జరిగే ఇలాంటి యుద్ధంలో గెలుపు ఎటువైపు ఉంటుందన్న ఆసక్తి ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇలాంటి కథా నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ ‘గాడ్‌ఫాదర్’, మణిరత్నం ‘నాయకుడు’ ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు అలాంటి కోవలో వచ్చిందే ఈ ‘మాలిక్’ కథ.
సులేమాన్ నేర జీవితాన్ని వదిలేయాలనుకోవడం.. పోలీసులు అతడిని చంపాలనుకోవడం.. తదితర సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. ఆరంభ సన్నివేశాలతోనే అసలు మాలిక్ ఎవరన్న సంగతి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించేలా చేశాడు దర్శకుడు మహేశ్. అక్కడి నుంచి మాలిక్ కుటుంబం రందాన్‌పల్లికి ఎలా వచ్చింది? చిన్న చిన్న నేరాలు చేస్తూ సులేమాన్ ఎదగడం.. ఈ క్రమంలోనే ఓ హత్య చేసి అతడు డాన్‌గా మారడం.. స్థానిక పోలీసులు, అధికారులను ఎదిరించే స్థాయికి వెళ్లడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం అంతా సాగుతుంది. ఆయా సన్నివేశాల్లో నాటకీయత ఉన్నా కథనం నెమ్మదిగా సాగుతుంది.
సులేమాన్ పూర్తిస్థాయి నాయకుడిగా ఎలా ఎదిగాడన్న విషయాన్ని ద్వితీయార్థంలో చూపించాడు దర్శకుడు. స్థానికతకు అద్దం పట్టేలా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దాడాయన. సులేమాన్ని దెబ్బతీయాలని భావించిన అధికారులు, పోలీసులు చేసిన కుట్రలు, సృష్టించిన మత కల్లోలాల కారణంగా జీవితంలో ఎంతో విలువైన వాటిని ఆయన కోల్పోతాడు. ఆయా సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తాయి. ఇక పతాక సన్నివేశాలైతే కన్నీళ్లు పెట్టిస్తాయి. రందాన్పల్లిలో జరిగిన మత కల్లోలాలకు పోలీసులే కారణమని తెలిసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో నాటకీయత, వాస్తవికతకు పెద్దపీట వేశారు దర్శకుడు. మలయాళీ సినిమానే అయినప్పటికీ తెలుగు ఆడియోతో ప్రసారం కావడం వల్ల ప్రేక్షకులు కథకు త్వరగా కనెక్ట్ అయ్యే వెసులుబాటు కలిగింది.
ఎవరెలా చేశారంటే: అలీ అహ్మద్ సులేమాన్ మాలిక్‌గా ఫహద్ ఫాజిల్ నటన మెప్పిస్తుంది. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వయసుమళ్లిన వ్యక్తిగా మూడు వేరియేషన్స్‌లో తనదైన ప్రతిభ కనబరిచాడు. వయసుల వారీగా ఆయన నటించిన ప్రతి సన్నివేశంలోనూ ఎక్కడా ఫహద్ మనకు కనిపించడు. కేవలం సులేమాన్గా మాత్రమే అందరికీ గుర్తుండిపోతాడు. పెద్ద వయసున్న పాత్రలో ఫహద్ నటన సెటిల్డ్‌గా ఉంది. పంచ్ డైలాగులు లేకపోయినా.. తన హావభావాలు, ఆహార్యంతో సన్నివేశాలను రక్తికట్టించాడు. నిమిషా సజయన్ (సులేమాన్ భార్య) పాత్ర పరిధి ఉన్నంత వరకూ అద్భుతంగా నటించింది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె డైలాగ్ డెలివరీ మెప్పిస్తుంది. పెద్ద వయసున్న పాత్రలో నిమిషా అంతగా అతకలేదేమో అనిపించింది. వినయ్ ఫోర్ట్, దిలీప్ పోథన్, జోజీ జార్జ్, సలీమ్ కుమార్, ఇంధ్రాన్, దివ్యప్రభా ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ ప్రతి సన్నివేశాన్నీ చక్కగా తీర్చిదిద్దారు. సుమారు 12 నిమిషాలపాటు సాగే ప్రారంభ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో చూపించడమంటే ఓ అద్భుతమనే చెప్పాలి. ఇలా ఆయన సినిమాలోని చాలా సన్నివేశాలు సింగిల్ టేక్‌లోనే చూపించారు. సంతోష్ రామన్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి ప్రధాన బలం. సుషిన్ శ్యామ్ సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం సినిమాకు మరో బలం. మూడు వేరు వేరు కాలాల్లో మనుషులు, ప్రాంతాలను చూపించిన విధానం కాస్ట్యూమ్ డిజైన్ పరంగా బాగుంది. థియేటర్ కోసం ఈ సినిమాని తీర్చిదిద్దారు. దీంతో సినిమా నిడివి పెరిగిపోయింది. సుమారు 2 గంటల 40 నిమిషాలు కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. ఓటీటీకి విడుదల చేసినప్పుడైనా కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే బాగుండేదనే భావన ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. దర్శకుడు మహేశ్ నారాయణనే ఎడిటర్ కూడా కావడంతో సన్నివేశాలపై కోతవేయలేకపోయాడేమో..! దర్శకుడిగా ‘మాలిక్’ను అద్భుతంగా తీర్చిదిద్దిన మహేశ్ నారాయణన్ ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+ ఫహద్ ఫాజిల్
+ మహేశ్ నారాయణన్ రచనా, దర్శకత్వం
+ సాంకేతిక విభాగం పనితీరు
బలహీనతలు
- నిడివి ఎక్కువగా ఉండడం
- కథాగమనం నెమ్మదిగా సాగడం
చివరిగా: ఫహద్-మహేశ్ నారాయణన్ మేజిక్ ఈ మాలిక్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా?