Geetha Madhuri: గీతా మాధురి కుమారుడి బారసాల.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో పేరు..

గాయని గీతామాధురి కుమారుడి బారసాల ఘనంగా జరిగింది.

Published : 04 Mar 2024 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాయని గీతామాధురి (Geetha Madhuri) ఫిబ్రవరి 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆ బాబుకు బారసాల కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ బాబుకు టాలీవుడ్‌ స్టార్‌ హీరో పేరు కలిసొచ్చేలా నామకరణం చేశారు. ‘ధృవధీర్‌ తారక్‌’ అని పెట్టినట్లు గీతా తెలిపారు. టాలీవుడ్‌ సంగీత దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పాప, బాబుతో తమ జీవితాల్ని సంపూర్ణం చేసుకున్న గీత-నందు దంపతులకు సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఫిబ్రవరి 10న మాకు కొడుకు పుట్టాడు.. మా జీవితాల్లోకి ఆనందం తెచ్చాడు..’ అంటూ నందు తాజాగా ఓ సందర్భంలో పంచుకుంటూ మురిసిపోయిన సంగతి తెలిసిందే.

గాయనిగా గీతా మాధురికి తెలుగులో మంచి పేరు ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆమె సూపర్‌హిట్‌ పాటలు పాడారు. కెరీర్‌లో రాణిస్తోన్న తరుణంలోనే నటుడు నందుతో ఏడడుగులు వేశారు. 2014లో వీరి వివాహం జరిగింది. నందు కూడా పలు సినిమాలతో ఆకట్టుకున్నారు. చివరిసారి ‘బొమ్మ బ్లాక్‌బస్టర్‌’ అనే మూవీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని