Miss Shetty Mr Polishetty: మిస్టర్‌ పొలిశెట్టితో మిస్‌ శెట్టి.. టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ విడుదల

ఈ కలయికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్‌ పొలిశెట్టి, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ప్రధాన పాత్రధారులుగా యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Updated : 02 Mar 2023 06:27 IST

అనుష్క... నవీన్‌ పొలిశెట్టి - ఈ కలయికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్‌ పొలిశెట్టి, ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ప్రధాన పాత్రధారులుగా యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ - ప్రమోద్‌ నిర్మాతలు. ఈ వేసవిలోనే తెలుగుతోపాటు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ అనే పేరుని ఖరారు చేశారు. బుధవారం సినిమా పేరుని ప్రకటించడంతోపాటు, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి... సిద్ధు పొలిశెట్టి అనే స్టాండప్‌ కమెడియన్‌ పాత్రలోనూ, కథానాయిక అనుష్క... అన్విత రవళిశెట్టి అనే షెఫ్‌ పాత్రలోనూ నటించారు. ‘‘అనుష్క, నవీన్‌  కొంచెం విరామం తీసుకుని చేసిన చిత్రమిది. ఆసక్తికరమైన ఈ కలయికపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా రూపొందుతోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు