ఎస్‌ఆర్‌కే కాలేజ్‌లో ‘పలాస’ చిత్ర బృందం సందడి

రక్షిత్‌, నక్షత కీలక పాత్రల్లో కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పలాస 1978’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం

Published : 20 Feb 2020 21:51 IST

విజయవాడ: రక్షిత్‌, నక్షత కీలక పాత్రల్లో కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పలాస 1978’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం ముమ్మరం చేసింది. గురువారం విజయవాడ ఎస్‌ఆర్‌కే కాలేజ్‌లో సందడి చేసింది. హీరో రక్షిత్‌, హీరోయిన్‌ నక్షత్రలు విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. వారితో కలిసి సెల్ఫీలు దిగారు.

శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని యువత ఆదరించాలని చిత్ర బృందం కోరింది. ప్రముఖ గాయకుడు రఘుకుంచె విలన్‌ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఆయనే సంగీతం అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని