స్క్రిప్టు చెబుతానని పిలిచి.. మీద చేయి వేశాడు!

బెంగాలీ ప్రముఖ దర్శకుడు అరిందం సిల్‌ తనను లైంగికంగా వేధించాడని నటి రూపాంజన మిత్రా ఆరోపించారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఇప్పుడు బెంగాలీ పరిశ్రమకు సోకింది. ‘భూమికన్య’ అనే సీరియల్‌ స్క్రిప్టు చర్చించాలని రమ్మని ఆయన తనతో తప్పుగా....

Published : 13 Jan 2020 20:11 IST

భయపడిపోయా.. గదిలోకి ఎవరైనా రావాలని ప్రార్థించా: నటి

ముంబయి: ప్రముఖ బెంగాలీ దర్శకుడు అరిందం సిల్‌ తనను లైంగికంగా వేధించాడని నటి రూపాంజన మిత్రా ఆరోపించారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘మీటూ’ ఇప్పుడు బెంగాలీ పరిశ్రమకు పాకింది. ‘భూమికన్య’ అనే సీరియల్‌ స్క్రిప్టు చర్చించాలని రమ్మని ఆయన తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘స్క్రిప్టు చర్చల కోసం నన్ను కోల్‌కతాలోని తన ఆఫీసుకు రమ్మని దర్శకుడు పిలిచాడు. తొలి ఎపిసోడ్‌ చదవాలన్నారు. దుర్గ పూజకు కొన్ని రోజుల క్రితం ఇది జరిగింది. నేను సాయంత్రం 5 గంటలకు.. ఆఫీసుకు వెళ్లే సరికీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయా. నాకెందుకో తేడాగా అనిపించింది. దర్శకుడు ఉన్నట్లుండి సీటు నుంచి పైకిలేచి నా ముఖం, భుజాన్ని నిమరడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆఫీసులో నేను, ఆయన మాత్రమే ఉన్నాం. నాకు చాలా భయమేసింది, అత్యాచారం జరుగుతుందేమో అన్న సందేహాం కూడా కలిగింది. గదిలోకి ఎవరైనా రావాలని ప్రార్థించా’.

‘కాసేపు అయ్యాక ఆయన్ను భరించలేకపోయా. నాతో స్క్రిప్టు గురించి మాత్రమే మాట్లాడండి అని తెగేసి చెప్పా. తన ఎత్తుగడలు నా వద్ద పనిచేయవని, నేను అలాంటి మహిళను కానని ఆయనకు అర్థమైంది. ఉన్నట్లుండి దర్శకుడి పాత్రలోకి వెళ్లిపోయి, స్క్రిప్టు వివరించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలకు ఆయన సతీమణి ఆఫీసుకు వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయా. గుక్కపట్టి ఏడ్చా. ఆ సీరియల్‌ ప్రసారమయ్యే ఛానల్‌తో నాకు ఒప్పందం ఉన్న ఒకే ఒక్క కారణంతో నేను ఈ విషయాన్ని అప్పుడు చెప్పలేకపోయా. ఛానల్‌ పరువుకు నష్టం కలిగించే పనులు చేయకూడదని కాంట్రాక్ట్‌లో ఉంది’ అని ఆమె చెప్పారు.

అయితే రూపాంజన మిత్రా ఆరోపణల్ని అరిందం సిల్‌ ఖండించారు. ‘ఇది రాజకీయం. ఆమె ఇలా ఎందుకు చెప్పారో నాకు తెలియదు. మేం పాత స్నేహితులం. నేను వేధించానని చెప్పిన రోజు ఆమె నాకు మెసేజ్‌ చేశారు. ‘నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా’ అని సందేశం పంపారు. నా దగ్గర ఇంకా ఆ సందేశం ఉంది, మీకు చూపించగలను. తనతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఆమె ఎందుకలా మెసేజ్‌ చేస్తారు. ఆమె అబద్ధం చెబుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. రూపాంజన మిత్రా బెంగాలీ బుల్లితెరపై పాపులర్‌ నటి. ఆమె అనేక సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అరిందం సిల్‌ పలు సినిమాలకు సైతం దర్శకత్వం వహించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని