ఓవైపు దళపతి.. మరోవైపు సేతుపతి

తమిళ తలపతి విజయ్‌ కథానాయకుడిగా, విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్టర్‌’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌, సెంకండ్‌ లుక్‌లు విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం..

Published : 26 Jan 2020 21:58 IST

ఆసక్తి పెంచుతున్న మాస్టర్‌ మూడో పోస్టర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇళయ దళపతి విజయ్‌ కథానాయకుడిగా, విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్టర్‌’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌, సెంకండ్‌ లుక్‌లు విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం.. తాజాగా మరో లుక్‌ విడుదల చేసింది. అయితే, ఈసారి విడుదల చేసిన ఈ లుక్‌ ముందు వాటికి భిన్నంగా, మరింత ఆసక్తి పెంచేలా ఉంది. ఈ పోస్టర్‌లో ఓవైపు తలపతి విజయ్‌, మరోవైపు విజయ్‌ సేతుపతి ఎదురెదురుగా ముఖాలపై గాయాలతో కనిపిస్తారు. ఇందులో ఇద్దరూ చొక్కా లేకుండా ఉండటంతో ఈ సినిమాలో విజయ్‌ సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించనున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నారు. ‘బ్లాక్‌బస్టర్‌ హిట్టు లోడింగ్‌’ అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ కొద్ది సేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో వరల్డ్‌వైడ్‌ ట్రెండింగ్‌గా మారింది.

విజయ్‌ హీరోగా వచ్చిన బిగిలే(విజిల్‌) భారీ విజయం సాధించింది. మరోవైపు విజయ్‌ సేతుపతి సైతం ప్రతినాయకుడి పాత్రల్లో ఇరగదీస్తున్నాడు. ఇద్దరు విజయ్‌ల కలయికలో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహన్‌ హీరోయిన్‌గా కనిపించనుండగా ఆండ్రియా, శాంతను ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎక్స్‌బీ ఫిలిమ్‌ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ. ఈ సినిమా ఏప్రిల్‌ 10న అభిమానుల ముందు రానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని