‘కేజీఎఫ్‌2’లో టాలీవుడ్‌ నటుడు

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు ‘కేజీఎఫ్‌2’ సెట్‌లో సందడి చేశారు. 2018లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీఎఫ్‌’ సినిమాకు ప్రస్తుతం స్వీకెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్‌ ఛాప్టర్2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు..

Published : 10 Feb 2020 15:34 IST

ఫొటో షేర్‌ చేసిన చిత్రబృందం 

హైదరాబాద్‌: ప్రముఖ టాలీవుడ్‌ నటుడు రావురమేష్‌ ‘కేజీఎఫ్‌2’ సెట్‌లో సందడి చేశారు. 2018లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీఎఫ్‌’ సినిమాకు ప్రస్తుతం స్వీకెల్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్‌ ఛాప్టర్2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌ కథానాయకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అయితే ‘కేజీఎఫ్‌’కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ‘కేజీఎఫ్2’ను మరింత అద్భుతంగా తెరకెక్కించేందుకు పనిచేస్తున్నానని దర్శకుడు ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘కేజీఎఫ్‌2’ బృందంలోకి కొత్త నటీనటులు వచ్చి చేరుతున్నారు. 

ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ‘అధీర’ పాత్రలో కనిపించనున్నండగా.. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ఆదివారం ‘కేజీఎఫ్‌2’ బృందంలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా నేడు ఈ బృందంలోకి ప్రముఖ టాలీవుడ్‌ నటుడు రావురమేష్‌ వచ్చి చేరారు. ‘కేజీఎఫ్‌2’ సినిమాలో ఆయన ఓ మంచి పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు రావురమేష్‌, దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ కలిసి దిగిన ఓ ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. మరోవైపు ప్రశాంత్‌నీల్‌ సైతం ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘కేజీఎఫ్‌2’ సామ్రాజ్యంలోకి రావు రమేష్‌ సర్‌కు స్వాగతం. వెండితెరపై చూపించేవరకూ మీరు ఎలాంటి పాత్రలో కనిపించనున్నారో తెలుసుకోమని ప్రేక్షకులకే వదిలేస్తున్నాం. ‘కేజీఎఫ్‌2’లో భాగమైనందుకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని