రానా ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా

కరోనా మహమ్మారి చిత్రసీమను మరోసారి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. కరోనా దెబ్బకు దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. థియేటర్లు మూసుకున్నాయి. సినీ రంగం ఇప్పుడిప్పుడే మళ్లీ పాత కళ సంతరించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Published : 23 Mar 2021 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి చిత్రసీమను మరోసారి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. కరోనా దెబ్బకు దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. థియేటర్లు మూసుకున్నాయి. సినీ రంగం ఇప్పుడిప్పుడే మళ్లీ పాత కళ సంతరించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలో మరోసారి కరోనా ప్రభావం చూపించింది. ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. తమిళంలో ‘కాదన్‌’, హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ పేర్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్‌ వెల్లడించింది. ‘ప్రియమైన ప్రేక్షకులకు.. ఈ వార్తను మీతో పంచుకోవడం బాధాకరం. కొవిడ్‌19 మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. తర్వాతి అప్డేట్‌ గురించి త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాదన్‌’ యథావిధిగా మార్చి 26న విడుదలవుతాయి’ అని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని