Adivi Sesh: ‘బిచ్చగాడు 2’ హిట్‌ అయింది.. ‘హత్య’ ప్రాఫిట్‌లో సగం కావాలి: అడివి శేష్‌

‘హత్య’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో యంగ్‌ హీరోలు అడివి శేష్‌, సందీప్‌ కిషన్‌ సందడి చేశారు. విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ఇది.

Published : 17 Jul 2023 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా బాలాజీ కె. కుమార్‌ తెరకెక్కించిన సినిమా ‘హత్య’. రితికా సింగ్‌ (Ritika Singh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయికలు. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకను ఆదివారం నిర్వహించింది. యంగ్‌ హీరోలు అడివి శేష్‌ (Adivi Sesh), సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ముఖ్య అతిథులుగా హాజరై, సందడి చేశారు.

పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని ఇమిటేట్‌ చేసిన చిరు.. ‘భోళాశంకర్‌’ నుంచి మరో లీక్‌!

శేష్‌ మాట్లాడుతూ.. ‘‘బిచ్చగాడు 2’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే విజయ్‌గారిని నేను తొలిసారి కలిశా. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ‘హత్య’ ప్రాఫిట్‌లో సగం నాకు ఇస్తారని ఆశిస్తున్నా (నవ్వుతూ). ఇది తమిళ, తెలుగు సినిమాలా కాదు ఇంటర్నేషనల్‌ మూవీలా అనిపిస్తోంది’’ అని అభిప్రాయపడ్డారు. సందీప్‌ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు బాలాజీతో నాకు పరిచయం ఉంది. ఆయన సినిమా లాంగ్వేజ్‌లో మాట్లాడుతుంటారు. కానీ, అది నాకు అర్థంకాదు. విజయ్‌ ఆంటోనీ మంచి కథలను ఎంపిక చేసుకుంటుంటారు. ఆయన నటనకేకాకుండా సంగీతానికి నేను పెద్ద అభిమానిని’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని