Krishna Vrinda Vihari: ఓటీటీలోకి ‘కృష్ణ వ్రింద విహారి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‌ కానుందంటే..?

Published : 18 Oct 2022 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య (Naga Shaurya) హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణ వ్రింద విహారి’ (Krishna Vrinda Vihari). సెప్టెంబరు 23న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడు ఐటీ కంపెనీలో టెక్నికల్‌ ట్రైనర్‌గా చేరి, అక్కడి మేనేజర్‌ను ప్రేమిస్తాడు. ఓ సమస్యతో బాధపడుతున్న ఆ మేనేజర్‌ పెళ్లికి నిరాకరిస్తుంది. ఆ సమస్యని దాచిపెట్టి పెళ్లికి పెద్దల్ని ఒప్పించేందుకు ఆ కుర్రాడు ఎన్ని అబద్ధాలు ఆడాడు? పెళ్లి తర్వాత ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు అనిష్‌ ఆర్‌. కృష్ణ తెరకెక్కించారు. షిర్లీ సేతియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో రాధిక, రాహుల్‌ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు