Upasana Konidela: పెళ్లి కాగానే మరో ప్రపంచానికి వచ్చినట్లనిపించింది: ఉపాసన

రామ్‌ చరణ్‌కు నీడలా ఉంటుంన్నందుకు ఆనందంగా ఉందన్నారు ఉపాసన.

Updated : 07 Mar 2024 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీ ఉన్నట్లు.. ప్రతి మహిళ విజయం వెనకాల ఓ పురుషుడు ఉండాలని రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన (Upasana Konidela) అభిప్రాయపడ్డారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఉపాసన మాట్లాడుతూ.. ‘మాది, రామ్‌ చరణ్‌ వాళ్లది పూర్తిగా భిన్నమైన కుటుంబ నేపథ్యాలు. నాకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది. ఇప్పుడు అతడికి నీడలా ఉంటున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మేమిద్దరం పరస్పరం సపోర్ట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. బిడ్డను కనాలని నిర్ణయించుకున్నప్పుడే క్లీంకారకు జన్మనిచ్చాం. మా అమ్మ వాళ్లను తాతయ్య ఆత్మవిశ్వాసంతో పెంచారు. వాళ్లు కూడా ఆయన కలలకు అనుగుణంగా జీవించారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలోనూ కీలకపాత్ర పోషించారు. నేను స్త్రీ ప్రపంచం అని భావించే వాతావరణంలో పుట్టాను’ అని చెప్పారు.

ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్‌

రామ్‌ చరణ్‌ కూడా ఉపాసనపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘కేవలం నా భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదు. ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయి. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసింది. కుటుంబ విలువలను గౌరవిస్తుంది.  వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకువెళ్తుంది’ అన్నారు. తాజాగా వీళ్లిద్దరూ అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లోనూ మెరిశారు. దీనిపై ఉపాసన పోస్ట్‌ పెట్టారు. ‘అంబానీల ఆతిథ్యం సాటిలేనిది. మీ కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని