Manchu Vishnu: వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు

తన కుటుంబానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తుంటారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). తాజాగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

Published : 02 Mar 2023 13:13 IST

హైదరాబాద్‌: తన కుమార్తెలు అరియానా, వివియానా ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి భావోద్వేగానికి గురయ్యారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). వాళ్లు ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇంతకీ వాళ్లు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఏమిటంటే..!

మంచు విష్ణు - ఆయన సతీమణి విరానికా బుధవారం వివాహ 15వ వార్షికోత్సవాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా అరియానా, వివియానా తన తల్లిదండ్రులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఓ వీడియోను బహుమతిగా అందించారు. ఈ వీడియోలో విష్ణు- విరానికాకు సంబంధించిన మోస్ట్‌ స్పెషల్‌ మూమెంట్స్‌ అన్నింటినీ పొందుపరిచారు. ‘మై ఫాదర్‌ లవ్స్‌ మై మామ్‌’ అంటూ ఓ పాటనూ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణు ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘ఈ సాంగ్‌ పూర్తయ్యే సమయానికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ డార్లింగ్స్‌. మీరిచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోను’’ అని రాసుకొచ్చారు. మరోవైపు.. విష్ణు నటించిన ‘జిన్నా’ చిత్రంలోనూ వీరిద్దరూ ఫ్రెండ్‌షిప్‌ పాట పాడి ప్రేక్షకులను అలరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని