Kareena Kapoor: యశ్‌తో నటించాలని ఉంది: కరీనా కపూర్‌

దక్షిణాది నటుడు యశ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉందని బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ (Kareena Kapoor) పేర్కొన్నారు. ఆయన యాక్టింగ్‌ అంటే తనకెంతో ఇష్టమన్నారు.

Updated : 16 Nov 2023 16:54 IST

ముంబయి: కరణ్‌ జోహర్‌ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో నటీమణులు కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor), అలియాభట్‌ (Alia Bhatt) తాజాగా సందడి చేశారు. తమ కెరీర్‌పై పలు విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా.. ‘‘సారా అలీఖాన్‌ (కరీనా భర్త, నటుడు సైఫ్‌ అలీఖాన్‌ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? దక్షిణాదికి చెందిన ఏ హీరోతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నావు?’’ అంటూ కరీనాను కరణ్‌ జోహర్‌ ప్రశ్నించాడు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘‘నేనొక నటిని. ఎలాంటి పాత్రలైనా చేయాలి. ఒకవేళ సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే దక్షిణాదికి చెందిన యశ్‌ యాక్టింగ్‌ నాకెంతో నచ్చుతుంది. ఆయన పక్కన యాక్ట్‌ చేయాలని ఉంది. ‘కేజీయఫ్‌’ చూశా. సినిమా బాగా నచ్చింది’’ అని చెప్పారు.

Kajol: కాజోల్ డ్రెస్‌ ఛేంజింగ్ వీడియో అంటూ ప్రచారం.. సినీ తారల కలవరపాటు

అనంతరం అలియాభట్‌ మాట్లాడుతూ.. తన కుమార్తె రాహ ఫొటో ఆన్‌లైన్‌లో లీకైన రోజు తానెంతో బాధపడ్డానని అన్నారు. ‘‘డెలివరీ తర్వాత మొదటిసారి ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ షూట్‌లో పాల్గొన్నా. ఓ వైపు పాపను చూసుకుంటూ మరోవైపు షూట్‌లో పాల్గొనడం కష్టంగా అనిపించేది. ఆ సమయంలో రణ్‌బీర్‌ నాకెంతో అండగా నిలిచాడు. ఆ సినిమా షూట్ సమయంలోనే ఓసారి రాహ ఫొటో ఆన్‌లైన్‌లో లీకైంది. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చేశాయి. అలాగే, రణ్‌బీర్‌ను కొంతమంది తరచూ నెగెటివ్ కామెంట్స్‌ చేస్తుంటారు. రణ్‌బీర్‌ ప్రవర్తనను వేలెత్తి చూపించి తిడుతుంటారు. ఆ కామెంట్స్‌ చూసి నేను బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి’’ అని అలియా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని